సినిమాలైనా, సీరియల్స్ అయినా హీరోయిన్ల దగ్గరనుండి సీరియల్ ఆర్టిస్టుల వరకూ ఎవరు గుడ్ న్యూస్ చెప్పినా అభిమానులు సంతోషిస్తారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి పల్లవి రామిశెట్టి.. ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పింది. పల్లవి అంటే తెలియకపోవచ్చు. ఆడదే ఆధారం, భార్యామణి, మాటే మంత్రము సీరియల్ నటి అంటే కొంచం త్వరగా గుర్తుపడతారు బుల్లితెర ప్రేక్షకులు. కొన్ని నెలల క్రితమే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి.. రీసెంట్ గా సీమంతం జరుపుకుంది. పల్లవికి సంబంధించి సీమంతం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఫ్యాన్స్ కి శుభవార్తగా.. తనకు పండంటి బాబు పుట్టాడని చెప్పింది పల్లవి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. అలాగే పుట్టిన బాబుకు సంబంధించి చిన్ని పాదాలను పిక్ తీసి పోస్ట్ చేసింది. పల్లవి ఇచ్చిన సర్ప్రైజ్ తో అభిమానులు, తోటి టీవీ సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మోడలింగ్ ద్వారా సీరియల్స్ లో అడుగుపెట్టిన పల్లవి.. సినిమాలైతే చేయలేదు. కానీ.. మొదటి నుండి సీరియల్స్ లో కంటిన్యూ అవుతోంది. ఎక్కువగా ఈటీవీలోనే సీరియల్స్ చేసిన పల్లవి.. భార్యామణి సీరియల్ కి గాను బెస్ట్ టీవీ యాక్ట్రెస్ గా నంది అవార్డు అందుకుంది.
ఇక ప్రస్తుతం పల్లవి కెరీర్ విషయానికి వస్తే.. భార్యామణి తర్వాత ఆడదే ఆధారం సీరియల్ లో అమృతగా అలరించిన ఈ బ్యూటీ.. అత్తారింటికి దారేదిలో కృష్ణవేణిగా.. మాటే మంత్రము సీరియల్ లో వసుంధరగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడైతే పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్ లో జ్యోతి క్యారెక్టర్ పోషిస్తోంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండదు గానీ.. అప్పుడప్పుడు ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని పలకరిస్తుంటుంది. అయితే.. 2019లో దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఏకంగా పల్లవి పండంటి బాబుకు జన్మనిచ్చి అందరికీ గుడ్ న్యూస్ చెప్పడం విశేషం.