ఆ కుర్రాడు నటుడు. దాదాపు 150కి పైగా సీరియల్స్ లో నటించాడు. 15 సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించాడు. నటుడిగా ఎంతోపేరు తెచ్చుకున్న అతడు.. నిర్మాతగా తొలి ప్రాజెక్టుని సిద్ధం చేశాడు. అంతలోనే ప్రాణాలు తీసుకోవడంతో సహ నటీనటులు షాక్ కి గురయ్యారు. అతడే లోకేష్ రాజేంద్రన్. లోకేష్ మృతిపై పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ‘మర్మదేశం’ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టు రాసు పాత్రలో అద్భుతంగా నటించి పేరు తెచ్చుకున్నాడు లోకేష్ రాజేంద్రన్.
ఇక ఈ సీరియల్ తోపాటు 150కి పైగా ధారావాహికల్లో లోకేష్ నటించాడు. పలు సినిమాల్లో సహాయపాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉండగా అక్టోబరు 2న చెన్నైలోని కోయంబేడు బస్ స్టేషన్ దగ్గర విషం తాగడంతో అపస్మారక స్థితిలో ఉన్న లోకేష్ ని స్థానికులు గుర్తించారు. స్థానికంగా ఉన్న కిల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన లోకేష్, అక్టోబరు 4న ప్రాణాలు విడిచాడు. పెళ్లి చేసుకున్న లోకేష్ కి ఇద్దరు పిల్లలు ఉ్నారు. భార్యతో విభేదాలు, ఆర్థిక కారణాల వల్ల తమ కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని లోకేష్ తండ్రి అంటున్నారు.
భార్యభర్తల గొడవల గురించి తనకు నెల క్రితమే తెలిసిందని, నాలుగు రోజుల క్రితం తన భార్య నుంచి లోకేష్ కి విడాకులు నోటీసులు వచ్చాయని, దీంతో అతడు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాడని లోకేష్ తండ్రి చెప్పారు. చివరగా శుక్రవారం కనిపించిన తన కొడుకు.. కొంత డబ్బు కావాలని తనని అడిగాడని, సర్దుబాటు చేసేంతలోపే ఇలా జరిగిపోయిందని బోరుమంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని తేలింది. ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి లోకేశ్ మృతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటి ఆకాంక్ష ఆత్మహత్య!