సినీ ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొంతమంది నటీనటులు చనిపోతే.. ఆత్మహత్యలకు పాల్పపడి కొంతమంది సెలబ్రెటీలు నిండు జీవితాలను బలిచేసుకుంటున్నారు. చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోయి జీవితాలను అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు.
ఇటీవల సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో బంగారు భవిష్యత్ ఉన్నవారు సైతం కొన్నిసార్లు డిప్రేషన్ కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్చి 26న ప్రముఖ బోజ్ పురి నటి ఆకాంక్ష దుబే ఓ హూటల్ గదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారే విషాదఛాయలు అలుముకున్నాయి. తాజాగా ఆకాంక్ష దుబే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..
భోజ్ పూరి ఫేమస్ నటి ఆకాంక్ష దుబే ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఓ హూటల్ గదిలో చనిపోయింది. చనిపోయే ముందు ఓ వీడియో సాంగ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో సాంగ్ లో భోజ్ పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ తో కలిసి కనిపించింది. ఆకాంక్ష దుబే చనిపోయిన విషయం పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోచేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. తాజాగా ఆకాంక్ష దుబే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె కడుపులో 20 మీ.లీ. గుర్తు తెలియని లిక్విడ్ ని గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆకాంక్ష దుబేది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
నటి ఆకాంక్ష దుబే 1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జన్మించింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ పై ఎంతో మక్కువ చూపించేదని.. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి సక్సెస్ సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ కేసులో ఆకాంక్ష దుబే తల్లి మధు దుబే తన కుమార్త మరణానికి ఇద్దరు వ్యక్తులు కారణం అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 21 న తన కూతురుని చంపేస్తామని సింగర్ సమర్ సింగ్ సోదరుడు సంజయ్ సింగ్ బెదిరించినట్లుగా.. తన కూతురు స్వయంగా ఫోన్ చేసి చెప్పి ఏడ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆకాంక్ష దుబే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో కేసు కొత్త మలుపు తిరిగింది.