అక్కినేని సుమంత్ హీరోగా నైనా గంగూలీ నటిస్తున్న చిత్రం ‘మళ్లీ మొదలైంది’. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కే రాజశేఖకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయనే చెప్పాలి.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఫస్ట్‌లుక్ చూస్తే అర్ధమవుతోంది. ఇక విషయానికొస్తే ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ సుహాసిని నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ వ్యాపారవేత్తగా నటించనుందని సమాచారం. ధైర్యసాహసాలు కలిగిన ఓ బడా వ్యాపారవేత్తగా ఈమె పాత్ర ఉండనుందట. ఇక సుహాసిని పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండునుందని చిత్ర యూనిట్ తెలిపుతోంది.
ఇక శుక్రవారం ఈ సినిమాకు సంభందించిన సుహాసిని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మూవీ యూనిట్. ఇందులో సాంప్రదాయమైన చీరకట్టులో దర్శనమిచ్చింది నటి సుహాసిని. ఈ చిత్రలో సుహా.. అనే పాత్రలో నటిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. గతంలో అనేక సినిమల్లో నటించిన సుహాసిని తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అటు హీరోయిన్ పాత్రలే కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటించి తన మాస్ క్యారెక్టర్‌ను చూపించింది. మరి ఈ మూవీలో సుహాసిని నటన ఎలా ఉంటుందో చూడాలి మరి.