తెలుగు చిత్రపరిశ్రమలో కొత్తగా ఎంత మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా కాడా.. పాత నటీనటుల్లో కొందరు మాత్రం ఇప్పటికీ గుర్తుంటారు. వారి గురించి ఏదొక సందర్భంలో అభిమానులు, ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి నటీమణుల్లో కృష్ణవేణి కూడా ఒకరు. 1979లో నగ్నసత్యం సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టారు. తాజాగా అల్లంత దూరానా చిత్రంతో మరోసారి తెరపై మెరిశారు. కృష్ణవేణి గారిని సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ జీవితంలో చూసిన ఎన్నో ఆటుపోట్లను, చూసిన సక్సెస్, వచ్చిన పొగడ్తలు, పడిన కష్టాలు అన్నింటిని పంచుకున్నారు.
ముఖ్యంగా ఆవిడ భర్త మృతి గురించి షాకింగ్ నిజాలను చెప్పుకొచ్చారు. తన భర్తను అతికిరాతకంగా హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. తన భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని తన ఇంటి ముందు పడేసి వెళ్లారని చెప్పారు. మృతదేహం మెడపై గొంతుపిసికినట్లు నాలుగు వేలి గుర్తులు తాను చూసినట్లు తెలిపారు. అలా చేసింది ఎవరు ఏంటని తనకి తెలుసన్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ తన భర్తను హత్య చేయించిందని ఆరోపించారు. ఇంకా ఆవిడ జీవితంలోని ఎన్నో విషయాల గురిచి పంచుకున్నారు. పూర్తి ఇంటర్వ్యూని ఈ కింద వీడియోలో చూడండి.