మీ టూ ఉద్యమంలో భాగంగా.. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు తమపై జరిగిన లైంగిక దాడులను ప్రపంచానికి తెలియపరిచారు. తాజాగా ఓ సీనియర్ నటి అర్ధరాత్రి ఓ స్టార్ హీరో తాగి డోర్ తియ్యమని గొడవ చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన వ్యక్తులను అవసరాల కోసం వాడుకుని, ఆ తర్వాత మోహం చాటేసే వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఉద్యమం మీ టూ ఉద్యమం. ఈ ఉద్యమం ద్వారా చాలా మంది సెలబ్రిటీలు తమపై జరిగిన లైంగిక దాడులను వెలుగులోకి తీసుకొచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటుగా మరికొన్ని పరిశ్రమల్లోని సెలబ్రిటీలు సైతం తమపై జరిగిన లైంగిక దాడులను ప్రపంచానికి తెలియపరిచారు. ఇక తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. అర్ధరాత్రి ఓ హీరో తాగి డోర్ తియ్యమని గొడవ చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నెరాడై నిర్మల.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే బేధం లేకుండా అన్ని దక్షిణాది బాషల్లో నటించింది. ఇక తన తొలి చిత్రమైన వెన్నెలాడే సినిమా పేరునే తన పేరుగా మార్చుకుంది. ఇక నిర్మల హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించింది. తన నటనతో పరిశ్రమంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిర్మల. కాగా తెలుగులో ఈమె భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దము రారండి, జయం మనదేరా, కలిసుందాం రా, నిన్నే ప్రేమిస్తా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. వయసు పైబడుతున్న కొద్ది సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో.. క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు నిర్మల.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వెన్నిరాడై నిర్మల. ఇక ఈ ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ లో ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. వెన్నిరాడై నిర్మల మాట్లాడుతూ..”ఆ రోజు సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పాక నేను ఇంటికి వచ్చేశాను. అయితే ఆ సినిమాలోని హీరో అర్ధరాత్రి తాగి వచ్చి మా ఇంటి తలుపు కొట్టాడు. డోర్ తియ్యమంటూ.. పదే పదే కొడుతున్నాడు. నేను డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, మీ పక్కనే పడుకుని వెళ్లిపోతాను అన్నాడు” అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది నిర్మల. ఇక నేను డోర్ తీయకపోవడంతో.. కొద్దిసేపటి తర్వాత అతడు వెళ్లిపోయాడు అని ఆమె అన్నారు.
ఇక ఈ సంఘటన జరిగిన రోజు నుంచి నేను ఆ సినిమా షూటింగ్ కు వెళ్లడం మానేశాను, ఆ సినిమా నుంచి కూడా తప్పుకున్నాను అని తెలిపారు. అయితే ఆ మూవీ డైరెక్టర్, నిర్మాత వచ్చి నన్ను బతిమిలాడారు. కానీ ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేయడంతో.. ఆ మూవీ నుంచి వైదొలిగాను అని నిర్మల చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరో పేరును, సినిమా పేరును మాత్రం వెల్లడించలేదు నిర్మల. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే అంటే.. మరికొందరేమో సినిమా మానేసి మంచి పని చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి అర్ధరాత్రి ఓ హీరో నటి తలుపు తట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.