టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కీర్తి సురేష్ మొదటిసారి మహేష్ సరసన జతకడుతోంది. ఈ సినిమా నుండి ఇటీవలే విడుదలైన ‘కళావతి’ సాంగ్ ఇప్పటికే సినిమా పై అంచనాలు పెంచేసింది.
ఇక ‘సర్కారు వారి పాట’ అనంతరం మహేష్.. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. అయితే.. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదీగాక ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా వరుస బ్లాక్ బస్టర్ లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి వీరి కలయికలో మూడో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే సినిమా పై బజ్ మొదలైంది.
ఇక తాజాగా మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ కీలకపాత్ర పోషించనుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు ఆంటీ(పిన్ని) పాత్రలో నటి శోభనను మేకర్స్ ఆల్రెడీ సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజాహెగ్డే నటించనుండగా.. హారిక హాసిని క్రియేషన్స్ సినిమాని నిర్మించిబోతుంది. మరి త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.