నిర్మలమ్మ.. తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. వెండితెరపై బామ్మ పాత్రకు ప్రాణం పోసిన సహజ నటి. గయ్యాళితనం ప్రదర్శించి నాలుగు మాటలు తిట్టినా.. ఆ వెంటనే మా బాబే అంటూ దగ్గరకు తీసినా ఆమెకే చెల్లింది. ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో ఆమె తన నటనతో అదరగొట్టింది. అలానే మయూరి చిత్రంలో మనవరాలి కోసం పరితపించే బామ్మ పాత్రలో జీవించేసింది. ఇందుకు గాను ఆమెకు నంది అవార్డు కూడా దక్కింది. ప్రాంరభంలో అమ్మ, అత్త క్యారెక్టర్లు చేసినా.. కెరీర్‌లో ఎక్కువగా బామ్మ ప్రాతలోనే నటించింది. ఒకానొక సందర్భంలో నిర్మలమ్మ లేకుండా సినిమాలు రాలేదంటే.. ఆమెకు ఎంత డిమాండ్ ఉండదో అర్థం చేసుకోవచ్చు. అలనాటి స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, యస్వీ రంగారావుల దగ్గర నుంచి నేటి స్టార్లు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించింది నిర్మలమ్మ.
ఇక నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. నాటకాలంటే విపరీతమైన అభిమానం. కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు. కానీ పెదనాన్న మద్దతుతో నాటకాల్లో రాణించింది. అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మలమ్మ 1943లో తన పదహరవ ఏట.. గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి తెరపై కనిపించింది. అలా ప్రారంభమైన ఆమె కెరీర్ ముందుకు సాగిపోయింది. సుమారు 1000 చిత్రాల్లో నటించింది నిర్మలమ్మ.
నిర్మలమ్మ కెరీర్‌లో ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి, సీతారామారాజు. మయూరి చిత్రంలో డ్యాన్స్ చేయాలని తపించే మనవరాలికి అండగా నిలిచే బామ్మ పాత్రలో జీవించింది నిర్మలమ్మ. ఇక సీతారామరాజు సినిమాలో అయితే ఏకంగా ప్రతినాయక లక్షణాలతో మెప్పించింది. ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు నంది అవార్డులు లభించాయి. చిరంజీవి స్నేహం కోసం సినిమా తర్వాత ఆమె నటించడం మానేసింది. ఆ తర్వాత 2009లో ఆమె మృతి చెందింది.
ఇక నిర్మలమ్మ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె పదో తరగతి వరకు చదువుకుంది. 19వ ఏట ఆమెకు వివాహం జరిగింది. ఇక ఆమెకు నాటకాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. అందుకు ఆమె ఇంట్లో వాళ్లు అంగీకరించేవారు కాదట. కానీ నిర్మలమ్మ పెదనాన్న మాత్రం.. ఆమెని ప్రొత్సాహించారట. ఈ క్రమంలో తాజాగా ఆమె యుక్తవయసులో.. అనగా నాటకాల్లో నటించే సమయంలో దిగిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిల్లో నిర్మలమ్మ.. ఎంతో అందంగా.. హీరోయిన్‌లా కనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.