ముచ్చర్ల అరుణ.. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్లం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో 70కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1980, 90ల్లో తన నటనతో వెండితెరను ఏలారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓ సీనియర్ నటిని.. దాదాపు 20 ఏళ్ల తర్వాత సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా పలకరించడం జరిగింది. ఆవిడ సినీ ప్రయాణం, ఆ రోజుల్లో వారు పడిన కష్టం, అప్పట్లో తారల మధ్య ఉన్న అనుబంధం గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆవిడకున్న అనుబంధం.. ఇంతటి గొప్ప స్టార్ గా ఎదగడానికి ఎంత కష్ట పడ్డారో అరుణ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవికి లైవ్ లో వీడియో మెసేజ్ రికార్డ్ చేసిన అరుణ.. తల్లిని తల్చుకుని బాధపడ్డారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కింది వీడియోలో ముచ్చర్ల అరుణ పూర్తి ఇంటర్య్వూ చూడండి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అకిరా నందన్ లో ఎవరికీ తెలియని మరో టాలెంట్.. ఈసారి పియానోతో..!
ఇదీ చదవండి: బెడ్ సీన్ పై నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన హీరోయిన్! చాట్ వైరల్!