తెలుగు చిత్రపరిశ్రమలో తరాలు గడిచినా ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే నటుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా సీనియర్ నటుల విషయంలో ఇదే జరుగుతుంది. వాళ్ళు సినిమాలు మానేసి చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. వారి ప్రస్తావన ఎక్కడా లేకపోయేసరికి అన్ని తరాల ప్రేక్షకులు వారిని మర్చిపోతుంటారు. కానీ ఎన్నేళ్లయినా కొందరి ముఖాలు చూడగానే గుర్తుపట్టే నటులు కొంతమంది ఉంటారు.
అలాంటి వారిలో ఒకరు సీనియర్ నటి కృష్ణవేణి. ఏపీలో పుట్టి పెరిగిన కృష్ణవేణి.. తెలుగులో ఎందరో హీరోల సినిమాల్లో నటించి కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవేణి గారు.. 1984లోనే చావును చూసి వచ్చానని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. ‘1984లో వీక్ అయిపోయి 40 రోజులపాటు కోమాలో ఉండిపోయాను. అసలు ఏమైందో తెలీదు.. అప్పట్లో పెద్దదైన విజయ హాస్పిటల్స్ లో నాకు ఆపరేషన్స్ మీద ఆపరేషన్స్ జరిగాయి’ అంటూ చెప్పింది. ప్రస్తుతం కృష్ణవేణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో చూసి నటి కృష్ణవేణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.