సాధారణంగా స్టార్ హీరోలకే ప్రైవేట్ జెట్లు గానీ, హెలికాప్టర్ గానీ ఉంటాయి. హీరోయిన్లకు ఉండే అవకాశం అయితే తక్కువే. ఇప్పటి సంగతేమో గానీ ఒకప్పటి నటీనటులు డబ్బులు సంపాదించేవారు గానీ కూడబెట్టుకునేవారు. దీంతో వారు జీవిత ముగింపు దశలో ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ కొంతమంది జాగ్రత్త పడ్డారు. విలాసవంతమైన భవనాలు, కార్లు అన్నీ కొనుక్కున్నారు. అయితే ఒక హీరోయిన్ కి సొంతంగా హెలికాప్టర్ కూడా ఉందట.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని మహానుభావులు ఊరికే చెప్పలేదు. కానీ చాలామంది మాత్రం దీపం ఆరిపోయాకే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకొని బాధపడతారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు పెద్దగా ఎలాంటి సమస్య ఉండదు. ఒక దశలో కాకపోయినా మరొక దశలోనైనా వీరు పోరాడితే సక్సెస్ వస్తుంది. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఒకసారి పెళ్లి చేసుకున్నా, లేకపోతే సినిమా అవకాశాలు తగ్గినా వీరిని ఎవరూ పట్టించుకోరు. కానీ సీనియర్ హీరోయిన్ కెఆర్ విజయ హీరోయిన్ గా ఉన్నప్పుడే.. అప్పట్లోనే సొంత హెలికాఫ్టర్ తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
సాధారణంగా కొంతమంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ తో పాపులర్ అవుతారు. మరికొంత మంది వారి డ్యాన్స్ లతో మెప్పిస్తారు. ఇంకొందరైతే వారి నటనతో పాత్రలకు ప్రాణం పోస్తారు. కానీ విజయ మాత్రం ఎక్కువగా భక్తి పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కేరళకు చెందిన మహిళ. అప్పట్లో జెమిని గణేశన్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన విజయ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ.. బాగా బిజీ అయిపోయింది. ముఖ్యంగా భక్తిరస చిత్రాల్లో నటించి.. అలాంటి చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయింది. సినిమాల్లో దేవత, అమ్మవారి పాత్రలు వేయాల్సివస్తే ఈమె మొదటి ప్రత్యామ్నాయంగా ఉండేది. ఇలాంటి పాత్రలు ఆమెకు గొప్ప పేరును తీసుకువచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ సీనియర్ నటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఆర్ధికముగా బాగా సెటిల్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అప్పట్లోనే ఆమెకు సొంతంగా ఒక హెలికాఫ్టర్ ఉండేదని తెలుస్తుంది. తెలుగు నటులు శోభన్ బాబు, మురళీమోహన్ తరహాలోనే ఆమె భూములను బాగా కొనుగోలు చేసేదట.
అంతేకాదు అప్పట్లోనే మద్రాస్ కి సమీపంలో 67 ఎకరాల ఒక తోటను కొనుగోలు చేసి అందరిని షాక్ కి గురి చేసింది. ఇందులో 4 ఎకరాల్లో ఒక పెద్ద ఇంటిని కూడా నిర్మించుకుందట. ఈ ఇంటి మీద హెలికాఫ్టర్ దిగేదని చెబుతూ ఉంటారు. అప్పట్లో స్టార్ హీరోలకి కూడా సొంత హెలికాప్టర్ లేకపోవడం గమనార్హం. ఇకపోతే.. ఈ స్టార్ హీరోయిన్ ఇంటిలో స్విమ్మింగ్ పూల్ తో పాటుగా.. అన్ని వసతులు ఉండేవట. ఆమె ఇంటిలో వసతులు చూసి ఎన్టీఆర్, ఎన్నార్ లు సైతం ఆశ్చర్యపోయారని తెలుస్తుంది. టాప్ హీరోలతో సమానంగా కె ఆర్ విజయ అనుభవించిన రాజ వైభోగం చూస్తుంటే.. అప్పట్లో బాగా కూడబెట్టిందని అర్ధం అవుతుంది. సహజంగా.. సినిమాల్లో కొనసాగినంత కాలం హీరోయిన్ల జీవితం బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఆర్థికంగా చాలా కష్టాలు పడతారు. ఇప్పటి తరం హీరోయిన్లు ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నా.. అలనాటి హీరోయిన్లు మాత్రం కాస్త వెనక పడ్డారనే చెప్పాలి. కానీ విజయ ఈ విషయంలో చాలా ప్లాన్డ్ గా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్లింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.