సామాన్యుల విషయంలో ఏమో కానీ సెలబ్రిటీల విషయంలో ప్రేమించుకోవడం, విడిపోవడం వంటివి చాలా సాధారణం. నచ్చితే రిలేషన్‌లో ముందుకు సాగుతారు.. లేదంటే విడిపోయి.. నచ్చిన మరో వ్యక్తితో ప్రేమలో పడటం కామన్. తాజాగా సీనియర్ నటి ఒకరు ఖుష్బూ-ప్రభుల ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
సామాన్యులు.. ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. విడాకులు, బ్రేకప్ వంటి వ్యహరాల గురించి బయటకు వెళ్లడించాలంటే.. ఇబ్బంది పడతారు. పరువు పోయినట్లుగా భావిస్తారు. చాలా వరకు బంధాల్లో సమాజానికి భయపడి.. ఏమనుకుంటారో అని ఆలోచించే.. విడిపోదామనే ఆలోచనను విరమించుకుంటారు. కానీ సెలబ్రిటీల విషయంలో ఇలాంటి పట్టింపులు ఏముండవు. తాము కంఫర్ట్‌గా ఉన్నంత వరకే రిలేషన్‌లో ఉండగల్గుతారు. పడలేదా.. అభిప్రాయ బేధాలు వచ్చాయా.. అంతే బ్రేకప్ చెప్పుకుంటారు.. విడాకులు తీసుకుంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రేమలో పడటం, వివాహం చేసుకోవడం, కుదరకపోతే విడిపోవడం, తర్వాత మళ్లీ వివాహం చేసుకోవడం వంటి సర్వ సాధారణంగా చోటు చేసుకునే అంశాలు. ఇక తాజాగా సీనియర్ నటి ఖుష్భూ, ప్రభులకు సంబంధించిన లవ్ స్టోరీ కూడా ఈ కోవకు చెందినదే. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు.. వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన 4 నెలలకే విడాకులు తీసుకున్నారట. ఈ విషయాలను ప్రముఖ నటి కాకినాడ శ్యామల ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది. ఆ వివరాలు..
ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో కూడా దూసుకుపోతుంది. ఇక గతంలో సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఖుష్బూ. ఆమెకు అభిమానులు గుడి కట్టారు అంటే.. ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. బాలనటిగా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ.. ఇప్పటి వరకు 200 సినిమాలకు పైగా నటించింది. సౌత్‌లో టాప్ హీరోలందరితో యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో తొలిసారి ప్రభుకు జోడిగా నటించింది ఖుష్బూ. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాక.. వీరిద్దరూ హిట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. పైగా ఇదే సినిమా ద్వారా ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ అవార్డు అందుకుంది ఖుష్బూ.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే.. ఖుష్బూ-ప్రభుల మధ్య ప్రేమ చిగురించింది అనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ పుకార్లను నిజం చేస్తూ.. రెండేళ్ల తర్వాత అనగా.. 1993, సెప్టెంబర్ 12న వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారట. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అప్పటికే ప్రభుకు పెళ్లి అయ్యింది. అయినా సరే..ఖుష్బు.. రెండో వివాహం చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి. పోయిస్ గార్డెన్‌లో వీరు కొనుక్కున్న ఇంట్లోనే వివాహం చేసుకున్నారని.. అయితే వీరి పెళ్లిని.. ప్రభు తండ్రి శివాజీ గణేశన్.. సహా అతడి కుటుంబం అంగీకరించలేదని సమాచారం.
దాంతో వీరి పెళ్లైన నాటి నుంచే అనేక గొడవలు మొదలయ్యాయి. దాంతో వివాహం అయిన 4 నెలలకే ప్రభు-ఖుష్బూ ఇద్దరూ విడిపోయారు. మరీ ముఖ్యంగా ప్రభు భార్య.. వీరి ప్రేమను, వివాహాన్ని అంగీకరించలేదు. దాంతో.. వీరిద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే వివాహానికి ముందే తామిద్దరం నాలుగున్నరేళ్లు.. సహజీవనం చేశామని.. గతలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఖుష్బూ. ఇక ప్రభుతో విడాకుల తర్వాత.. ఖుష్భూ మానసికంగా ఎంతో కుంగిపోయారట. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను వివాహం చేసుకుంది ఖుష్బు. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం ఉన్నారు.
ఇక ప్రభు-ఖుష్బూల బంధం గురించి తాజాగా సీనియర్ నటి కాకినాడ శ్యామల ఆసక్తికర వివరాలు వెల్లడించింది. ‘‘ఖుష్బూ చాలా మంచి అమ్మాయి. ప్రభు, ఖుష్బూ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రభుకు అప్పటికే వివాహం అయ్యింది. దాంతో మొదటి భార్య.. వీరి ప్రేమను అంగీకరించలేదు. ఫలితం.. నాలుగు నెలలకే ప్రభు-ఖుష్బూలు విడిపోయారు’’ అని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ఖుష్బూ-ప్రభుల ప్రేమ, పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.