సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. మే 22, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన చనిపోయారు. గత మూడు నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. శరత్ బాబు తన కెరీర్‌లో తెలుగు, తమిళం భాషల్లో మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాడు. రామరాజ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శరత్ బాబు.. టాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శరత్ బాబు మృతిపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శరత్ బాబు మృతి నేపథ్యంలో.. ఆయన అభిమానుల సందర్శనార్థం సోమవారం సాయంత్రం ఓ 2 గంటల పాటు హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో ఆయన పార్థీవ దేహాన్ని ఉంచారు. అనంతరం ఆయన మృత దేహాన్ని చెన్నై తరలించారు. మంగళవారం మధ్యాహ్నం శరత్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరత్ బాబుకు సంతానం లేరు.. మరి ఆయనకు ఎవరు తలకొరివి పెడతారు అన్న దాని గురించి జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక శరత్ బాబు మృతి పట్ల కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
శరత్ బాబు తోడబుట్టిన వాళ్లల్లో ఆయన అన్నయ్య ఉమా దీక్షితులు, తమ్ముళ్లు గోపాల్, గోవింద్, సంతోష్, మధు, మంజు ఉన్నారు. ఆయన రెండో అన్నయ్య రమా దీక్షితులు మూడు సంవత్సరాల క్రితం మృతి చెందారు అక్కాచెల్లుళ్లు సిరి, రాణి, బేబీ, మున్ని, రోజాలు. శరత్ బాబు తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నెల 26న ఈ సినిమా విడుదల కానుంది.