సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఎప్పుడెప్పుడు ఏ వార్తలో కనిపిస్తారా.. అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఓ స్పోర్ట్స్ కారు చూపించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ఇటీవలే ఆయన డీసీ అవంతి మోడల్ స్పోర్ట్స్ కారు కొన్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అలాగే ట్విట్టర్ ఖాతా ఫోటో కూడా మార్చేశానని పోస్టులో చెప్పుకొచ్చాడు.
‘నా కల నెరవేరిందోచ్.. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అని చెబుతూ తన కారు చూపించాడు. పర్పుల్ కలర్ కలిగిన ఈ కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చేతికి డ్రైవింగ్ గ్లవ్స్ ధరించి కారు పక్కన నిల్చున్న ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నాడు. కారు ఖరీదు కూడా 35 లక్షల పైనే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నరేష్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022
ఇక ప్రస్తుతం నరేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సహాయ నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు హీరో/హీరోయిన్ లకు తండ్రి/మామ లాంటి రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. మరి మీరు కూడా నటుడు నరేష్ కొత్త కారు పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.