తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా పేరుపొందిన నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కైకాల పరిస్థితి విషమించటంతో వైద్యలు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే గతంలో కైకాల సత్యనారాయణ తమ ఇంట్లో జారిపడినట్లు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ లోని ఓ ఆస్పత్రికి చికిత్స అందించారు. అయితే మరోసారి కాలుకు సంబంధించిన కారణం ఏదైన ఉందా లేదంటే మరేదైన సమస్యతో కైకాల సత్యనారాయణ బాధపడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.