ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు ఏవి రిలీజ్ అయినా ప్రమోషన్స్ మొదలుకొని సక్సెస్ మీట్ వరకూ అన్నీ వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలకు సంబంధించి ఇంటర్వ్యూలను సెలబ్రిటీలతో ప్లాన్ చేస్తున్నారు. అంటే.. ఇలాంటి ఇంటర్వ్యూలకు యాంకర్స్ గా సినీనటులే ఉంటుంటారు. తాజాగా F3 చిత్రబృందం పాల్గొన్న ఇంటర్వ్యూలో సీనియర్ నటులు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం యాంకరింగ్ చేశారు.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఎఫ్3 మంచి లాభాలను తెచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు కాగా దిల్ రాజు సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందంతో స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేశారు. అయితే.. ఈ ఇంటర్వ్యూకి వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి, కమెడియన్ ఆలీ హాజరయ్యారు.
ఇక ఎఫ్3 టీమ్ తో ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను బయటికి రాబట్టిన బ్రహ్మానందం.. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన మాట్లాడుతూ.. “ఎఫ్3 సినిమా చూసి నేను చాలా హర్ట్ అయ్యాను. అసలు ఏంటి ఆ యాక్టింగ్..?” అంటూ చేసిన కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఎఫ్3 గురించి బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.