శేఖర్ మాస్టర్ టు వెండితెర ప్రేక్షకులకే కాదు.. జడ్జ్ గా బుల్లితెర ప్రేక్షకులకు సైతం సుపరిచితులే. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో మెగా బ్రదర్ నాగబాబుతో పాటు రెండో జడ్జ్ గా వ్యవహరిస్తున్న సగంతి తెలిసిందే. కామెడీ స్టార్స్ ధమాకా ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈసారి కామెడీ స్టార్స్ ధమాకా కార్యక్రమంలో నాగబాబు ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేశారు. అదేంటంటే.. కంటెస్టెంట్లకు డిసిప్లైన్ నేర్పించడం. క్రమశిక్షణ ఊరికే రాదు కదా.. ఆ క్రమంలో కమేడియన్లకు గట్టిగానే దెబ్బలు పడ్డాయి. అయితే అనుకోకుండా శేఖర్ మాస్టర్ కూడా బాధితుడు అయ్యాడు.
ఇదీ చదవండి: వీడియో: రొమాంటిక్ పాటకు ‘కార్తీక దీపం’ ఫేమ్ కార్తీక్ – మోనిత డ్యాన్స్!
ఎక్స్‌ప్రెస్ హరిని పిలిచి నాగబాబు సద్దాం నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్తారు. అయితే వెంటనే హరి కోపంగా కర్ర తీసుకుని సద్దాంను కొట్టేందుకు వెళ్తాడు. సద్దాంను శేఖర్ మాస్టర్ వెనుక నుంచి పారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉన్నాడు. సద్దాంను కొట్టపోగా అతను కదలడంతో ఆ దెబ్బ శేఖర్ మాస్టర్ కాలికి తగిలింది. అయితే సన్న పుల్ల కావడంతో శేఖర్ మాస్టర్ కు వాత గట్టిగానే పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత వెంటనే హరి వెళ్లి శేఖర్ మాస్టర్ కాలు పట్టుకుని కాస్త కూల్ చేశాడు. అయితే ఆ ప్రోమోలో ఇప్పుడు ఆ ఘటనే హైలెట్ గా నిలిచింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.