తెలుగు సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన శేఖర్ మాస్టర్.. ఢీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ తన స్టయిల్ లో కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్.. సినిమాల్లోకి వచ్చాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఓవైపు కొరియోగ్రాఫర్ గా యూనిక్ స్టెప్స్ తో పేరు తెచ్చుకున్న ఆయన.. తాజాగా తన కెరీర్ కి సంబంధించి ఎదుర్కొన్న పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.
మొదట్లో రాకేష్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యానని, ఆయన దగ్గర కొద్దికాలమే ఉన్నానని శేఖర్ మాస్టర్ చెప్పారు. అలాగే తన డ్యాన్స్ ని లారెన్స్ ప్రశంసించారని.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సాంగ్స్ ఎక్కువగా చేసానని చెప్పాడు. ఇక కొరియోగ్రాఫర్ గా పోస్ట్ బాక్స్ అనే సినిమాకు మొదటిసారి వర్క్ చేశానని, కానీ.. ఆ సినిమా రిలీజ్ కాలేదని చెబుతూ వాపోయాడు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంటుందని చెబుతూ.. తాను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపాడు.
ఇంకా మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. కానీ.. అలా ఎంతకాలం తెచ్చుకుంటాము. అలాగే దొంగచాటుగా ఫంక్ష హాల్స్ కు వెళ్లి తినేవాళ్ళం. మమ్మల్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు సత్య కవర్ చేసేవాడని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. రెండు మూడు సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లానని, అప్పుడు తనకు 75 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిపాడు. రోజుకు ఒకపూట తిండి దొరికినా హ్యాపీ అనుకునే టైంలో 75 రూపాయలు కూడా ఎక్కువేనని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి శేఖర్ మాస్టర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.