ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఓ పార్క్ లో సల్మాన్ ఖాన్ తండ్రికి హిందీలో రాసిన ఓ లేఖ లభించింది.. అందులో సల్మాన్ ఖాన్ ని చంపుతామని బెదిరింపులు ఉన్నాయి. ఇలా పలుమార్లు సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బీష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తొమ్మిదేళ్ల పాటు వరుసగా బాలీవుడ్ కి అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలు అందించిన ఘనత సల్మాన్ కే దక్కింది. హీరోగా ఎంతో పాపులారిటీ సంపాదించిన సల్మాన్.. అంతే స్థాయిలో ఆయన్ని వివాదాలు చుట్టుముట్టాయి. కృష్ణ జింక వేట, ఫుట్ పాత్ హిట్ అండ్ రన్ కేసు, 2019లో ముంబైలో జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసు.. ఇలా ఎన్నో వివాదాలు ఆయనపై ఉన్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని పలుమార్లు బెదిరింపుల లేఖలు, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని ఆయన కార్యాలయానికి శనివారం ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు ఆయన సిబ్బంది తెలిపారు. దీంతో అప్రమత్తమైన సల్మాన్ టీమ్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బీష్టోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరు తో ఈ బెదింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. లారెన్స్ బీష్ణోయ్ ఈ మద్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారని.. అది సల్మాన్ చూసి ఉంటాడని.. లేకుంటే చూడాలని ఆ లేఖ సారాంశం. ఇది హిదీలో పంపించారు. ప్రస్తుతం ఆ మెయిల్ ని పరిశీలిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు.
సల్మాన్ ఖాన్ కి మరోసారి బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కి ముప్పు ఉందని గుర్తించిన ముంబై పోలీసులు వెంటనే ఆయన నివాసం వద్ద వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించారు. గ్యాంగ్ స్టర్ బీష్టోయ్ నుంచి సల్మాన్ కి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రత కలప్పించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే సల్మాన్ టీమ్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 506(2), 120(బి), 34 సెక్షన్ ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్ కి గ్యాస్టర్ బీష్ణోయ్ బెదిరించడం ఇదే మొదటిసారి కాదు.. 2018 లో కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ సందర్భంగా చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు సల్మాన్ ఖాని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు. తాజాగా మరోసారి బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తుంది.
Salman Khan receives threat mail, files FIR with Mumbai Policehttps://t.co/8IujFuz4jR
— The Times Of India (@timesofindia) March 20, 2023