Taraka Ratna Death News: లోకేశ్ యువగళం పేరిట ప్రారంభించిన పాదయాత్రలో గుండె పోటుకు గురైయ్యారు తారకరత్న. దాంతో వెంటనే ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం సాయంత్రం తరకరత్న కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న చేతిపై ఉన్న టాటూకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఆ సింహం టాటూ వెనక ఓ చరిత్రే ఉంది. అది ఒకరిపై ప్రేమతో తారకరత్న తన చేతిపై వేయించుకున్నాయి.
నందమూరి తారకరత్న.. మృత్యువుతో పోరాడుతూ.. పోరాడుతూ.. శనివారం సాయంత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహాశివరాత్రి నాడే ఆయన శివైక్యం చెందారు. ఇక తారకరత్న మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. హీరోగా, విలన్ గా నటనలో తనదైన వైవిధ్యం చూపించారు ఆయన. ఇక తాజాగా లోకేశ్ యువగళం పేరిట ప్రారంభించిన పాదయాత్రలో గుండె పోటుకు గురైయ్యారు తారకరత్న. దాంతో వెంటనే ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయాణ హృదయాలయ హస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలోనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం సాయంత్రం తరకరత్న కన్నుమూశారు.
ఈ నేపథ్యంలోనే తారకరత్న చేతిపై ఉన్న టాటూకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఆ సింహం టాటూ వెనక ఓ చరిత్రే ఉంది. అది ఒకరిపై ప్రేమతో తారకరత్న తన చేతిపై వేయించుకున్నాయి. ఇక ఆ సింహం బొమ్మకింద ఉన్న ఆటోగ్రాఫ్ ఎవరిదో తెలుసా? ఆ సింహం టాటూ వెనక ఉన్నది ఎవరో కాదు. నటసింహం నందమూరి బాలకృష్ణ. బాబాయ్ పై ఉన్న వెలకట్టలేని ప్రేమకు నిదర్శనంగా ఆ సింహం టాటూను వేయించుకున్నారు తారకరత్న. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ టాటూను బాబాయ్ బాలకృష్ణపై ఉన్న ప్రేమకు గుర్తుగా వేయించుకున్నారు.
ఇక ఆ సింహం కింద ఉన్న పేరు బాలయ్య ఆటోగ్రాఫ్ కావడం గమనార్హం. అబ్బాయ్-బాబాయ్ ల మధ్యలో ఉన్న అనుబంధం కారణంగానే తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంతగానో తల్లడిల్లారు బాలయ్య బాబు. గుండెపోటుకు గురైన దగ్గర నుంచి శివైక్యం చెందే వరకు బాలయ్య.. తారకరత్నను కన్న బిడ్డలా చూసుకున్నారు. ఇంత ప్రేమ చూపించారు కాబట్టే తారకరత్న తన బాబాయ్ కి గుర్తుగా సింహం టాటూను తన చేతిపై వేయించుకున్నారు. వీరిద్దరి అనుబంధం అబ్బాయ్-బాబాయ్ ల అనుబంధంలా కాకుండా ఓ తండ్రి కొడుకులకు ఉన్న అనుబంధంలా ఉంటుందని చూసిన వాళ్లందరు చెబుతున్నారు. ఇక తారకరత్న మృతిపై సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. సీఎం కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి తదితరులు తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.