సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు నటీనటులు చెబుతుంటారు ఆ పాత్ర నచ్చకపోయినా సినిమా చేశానని, స్టోరీ నచ్చకపోయినా దర్శకుడి కోసం చేశాను, లేదా హీరో కోసం చేశానంటూ చెప్పడం వింటూ ఉంటాం. తాజాగా స్టార్ యాక్టర్ సత్యరాజ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చకపోయినా సినిమా చేశానని చెప్పి షాకిచ్చాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సత్యరాజ్.. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా సత్యరాజ్ కి దేశవ్యాప్తంగా స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా అంటే.. బాహుబలి అనే చెప్పాలి. బాహుబలిలో కట్టప్పగా సత్యరాజ్ అన్ని భాషలవారినీ ఆకట్టుకొని.. సూపర్ క్రేజ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. ఇప్పటివరకూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సత్యరాజ్.. ఓ స్టార్ హీరో సినిమాలో పాత్ర నచ్చకపోయినా నటించానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ సత్యరాజ్ చేసిన ఆ సినిమా ఏంటి? పాత్ర నచ్చకుండా సినిమా ఎందుకు చేశాడు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
2013లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. హిందీతో పాటు అన్ని సౌత్ భాషల ప్రేక్షకులకు ఆ సినిమా దగ్గరైంది. ఈ సినిమాలో దీపికా పదుకోనె హీరోయిన్ గా నటించింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ స్టోరీతో దర్శకుడు రోహిత్ శెట్టి.. సత్యరాజ్‌ను కలిసినప్పుడు తనకు ఆ పాత్ర ఏ మాత్రం నచ్చలేదని.. హీరో, డైరెక్టర్‌లకు చెప్పేశాడట. కానీ పాత్ర నచ్చకపోయినా, షారుఖ్ మీద అభిమానంతో సినిమా చేశానని చెప్పాడట. అలాగే.. ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ సినిమా కూడా షారుఖ్ మీద అభిమానంతోనే చాలాసార్లు చూశానని చెప్పినట్లు సమాచారం. మరి సత్యరాజ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.