పరశురామ్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న విడుదలైన ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. షేర్ చూసినట్లయితే.. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా.. మాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో అందరికీ అప్పులు ఇస్తూ.. వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్‌లో మహేష్ అద్భుతంగా నటించాడు. బడాబాబులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొడితే.. సామాన్యుల నుంచి బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా వసూలు చేస్తున్నాయనే కోణంలో పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాను థియేటర్స్‌లో చూడలేని ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో రెండు తేదీలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జూన్ 10 లేదా జూన్ 24.. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకరోజున ‘సర్కారు వారి పాట’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందట. ఇంకేం ఓటీటీలో మరోసారి చూద్దాము అనుకుంటే.. అత్యాశే అవుతుంది. ఈ సినిమాను కూడా పే పర్ వ్యూ కాన్సెప్ట్‌లోనే విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Anand Mahindra: సర్కారు వారి పాట సినిమాపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!
ఇక అమెజాన్‌లో ఈ సినిమా చూడాలంటే.. అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ అమౌంట్ కాకుండా.. మరో 199 రూపాయలు చెల్లించాలి. అది కూడా 30 రోజుల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఒక సారి సినిమా చూడ్డం ప్రారంభిస్తే.. 48 గంటల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి సినీ లవర్స్, మహేష్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి నిర్ణయాల వల్లే పైరసీ పెరుగుతుంది అంటున్నారు. ఇక గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ విషయంలో జీ 5 ఇదే నిర్ణయం తీసుకుంది. కానీ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. దెబ్బకు దిగివచ్చి.. సబ్‌స్క్రైబర్లందరికి ఉచితమే అని ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Mahesh Babu: లైఫ్‌ను ఎంజాయ్ చేయాలంటే మహేష్‌బాబు తర్వాతే ఎవరైన! ఫ్లైట్ ఎక్కేశాడు..
ఇక కేజీఎఫ్ విషయంలో కూడా అమెజాన్ పే పర్ వ్యూ కాన్సెప్ట్‌ని తీసుకువచ్చింది. కానీ దానికి పెద్దగా స్పందన కరువువ్వడమే కాక విమర్శలు రావడంతో.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరి ఇప్పుడు సర్కారి వారి పాట సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Anchor Shyamala: మమ్మ మహేశా.. పాటకు యాంకర్ శ్యామల మాస్ డాన్స్.. వీడియో వైరల్!