సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా.. పరశురామ్ డైరెక్షన్ లో విడుదలైన సర్కారు వారి పాట సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 108 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా థియేటర్లలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ మూవీలో డైలాగ్స్, మహేశ్ స్వాగ్ అన్నీ పోకిరిలో మహేశ్ ని గుర్తుచేస్తున్నాయంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ రికార్డు కలెక్షన్స్ చూసిన ఆనందంలోనే మహేశ్ బాబు ఎప్పుడూ లేనిది సక్సెస్ మీట్ లో స్టేజ్ పై డాన్స్ కూడా చేశాడు. ఒక రీజనల్ సినిమాగా టాలీవుడ్ లో రికార్డులు కూడా గట్టిగా క్రియేట్ చేస్తోంది.
సర్కారు వారి పాటసినిమా టాలీవుడ్ లో రీజనల్ మూవీస్ రికార్డులు బద్దలు కొడుతోందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. టాలీవుడ్ రీజనల్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.160 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా సర్కారు వారి పాట మూవీ రికార్డులు సృష్టించిందని వెల్లడించారు. అటు ఓవర్సీస్ లోనూ సర్కారు వారి పాట సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. నార్త్ అమెరికాలో(అమెరికా+కెనడా)లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్(15.64 కోట్లు) కలెక్షన్స్ దాటేసింది. ఓవర్సీస్‌లో మహేశ్ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసినట్లు అయ్యింది.
ఇదీ చదవండి: యాంకర్ అనసూయ ఫ్యామిలీ ట్రిప్.. ఫొటోస్ వైరల్!
#BlockbusterSVP is setting new benchmarks in TFI 🔥#SVP #SVPMania #SarkaruVaariPaata
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/g4bAenYhDI
— Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2022
సర్కారు వారి పాట మొత్తంగా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 108.12 కోట్లు షేర్, రూ. 145 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఐదో రోజు ఏకంగా 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఐదో రోజు కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఐదో రోజు రూ.7.13 కోట్లు షేర్ రాబట్టింది. అంటే మొత్తం ఐదు రోజుల్లో సర్కారు వారి పాట సినిమా 115.25 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి 120 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే సర్కారు వారి పాట సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు కలెక్ట్ చేయాలి. ఐదు రోజుల్లో 115.25 కోట్లు వసూలు చేసింది. ఆరో రోజు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#SarkaruVaariPaata AP/TS Box Office
GOOD numbers from working Monday.
Day 1 – ₹ 52.18 cr
Day 2 – ₹ 17.06 cr
Day 3 – ₹ 19.30 cr
Day 4 – ₹ 19.58 cr
Day 5 – ₹ 7.13 cr
Total – ₹ 115.25 cr#MaheshBabu— Manobala Vijayabalan (@ManobalaV) May 17, 2022