సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట‘. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. అయితే.. పెద్ద సినిమాలు అన్నాక లీక్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. తాజాగా సర్కారు వారి పాటకి కూడా లీక్స్ బెడద తప్పలేదు.
తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా సర్కారు వారి సినిమా నుండి ‘కళావతి‘ అనే లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అందుకోసమని పాటకి సంబంధించి రోజులో అప్ డేట్ వదులుతున్నారు. ఇటీవలే కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. బాగుంది ఫిబ్రవరి 14న ఫుల్ సాంగ్ రాబోతుందని వెయిట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి చేదు వార్త ఎదురైంది.
కళావతి ఫుల్ సాంగ్ లీక్ అయిపోయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ పై ఉన్న అంచనాల గురించి పక్కన పెడితే.. లీక్స్ అనేది సినిమా పై నెగటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ట్విట్టర్ వేదికగా ఇప్పటికే కళావతి ఫుల్ లీకెడ్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. మేకర్స్ ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి. మహేష్ ఫ్యాన్స్ మాత్రం సాంగ్ లీక్ అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#Kalaavathi full song leaked
Any body want Dm me ☺️ !!#SarkaruVaariPaata pic.twitter.com/uBHqVv3LYF— Manu Rayal (@ManuRayal3) February 12, 2022