సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్, ఎనర్జీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. సర్కారు వారి పాటకు ముందు నుండే భారీ హైప్ ఉండటంతో అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ 103 కోట్లు గ్రాస్ రాబట్టిన సర్కారు వారి పాట.. 4వ రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 4వ రోజు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు.
#SarkaruVaariPaata FLIES past ₹150 cr globally.
— Manobala Vijayabalan (@ManobalaV) May 16, 2022
ఇక సర్కారు వారి పాట మొత్తంగా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 108.12 కోట్లు షేర్, రూ. 145 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. రీజినల్ సినిమాగా సర్కారు వారి పాట.. 4 రోజుల్లోనే భీమ్లానాయక్ క్లోసింగ్ కలెక్షన్స్ క్రాస్ చేసింది. అయితే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే.. రూ. 121 కోట్లుగా ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే సర్కారు వారి పాట మరో రూ. 13 కోట్లు వసూలు చేస్తే సరిపోతుందని సమాచారం. ఈ లెక్కన 5వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. మరి సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#SarkaruVaariPaata AP/TS Box Office
CROSSES ₹100 cr gross mark.
Day 1 – ₹ 52.18 cr
Day 2 – ₹ 17.06 cr
Day 3 – ₹ 19.30 cr
Day 4 – ₹ 19.58 cr
Total – ₹ 108.12 crFASTEST for a regional film in TFI.#MaheshBabu
— Manobala Vijayabalan (@ManobalaV) May 16, 2022