సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది.
సర్కారు వారి పాటకు ముందు నుండే భారీ హైప్ ఉండటంతో అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ 103 కోట్లు గ్రాస్ రాబట్టిన సర్కారు వారి పాట.. మూడో రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 3వ రోజు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు.
సర్కారు వారి పాట 3వ రోజు (ఏరియా వైస్) కలెక్షన్స్:
నైజాంలో రూ. 5.36 కోట్లు
సీడెడ్‌లో రూ. 1.42 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 1.95 కోట్లు
ఈస్ట్‌లో రూ. 1.06 కోట్లు
వెస్ట్‌లో రూ. 45 లక్షలు
గుంటూరులో రూ. 46 లక్షలు
కృష్ణాలో రూ. 92 లక్షలు
నెల్లూరులో రూ. 39 లక్షలు
మొత్తం రూ. 12.01 కోట్లు షేర్, రూ. 18.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘సర్కారు వారి పాట’ మూడు రోజులకు గానూ.. నైజాంలో రూ. 22.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.34 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.39 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 3.75 కోట్లు, నెల్లూరులో రూ. 2.30 కోట్లతో కలిపి రూ. 59.06 కోట్లు షేర్, రూ. 84.40 కోట్లు గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
మిగతా ఏరియాల్లో చూసినట్లయితే.. కర్నాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 3.95 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9.21 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 72.22 కోట్లు షేర్, రూ. 120 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే.. రూ. 120 కోట్లు. కాబట్టి సర్కారు వారి పాట మరో రూ. 48.78 కోట్లు వసూలు చేస్తే హిట్స్ లిస్టులో చేరుతుంది. మరి సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.