ప్రస్తుతం సినీ అభిమానులంతా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మే 2న(సోమవారం) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సర్కారు వారి పాట ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ని 105 స్పెషల్ షాట్స్ తో సిద్ధం చేశారు.
మొత్తానికి సర్కారు వారి ఫ్యాన్స్ వెయిటింగ్ కి బ్రేక్ వేస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ సరసన మొదటిసారి కీర్తిసురేష్ రొమాన్స్ చేస్తోంది. మహేష్ కెరీర్ లో 27వ సినిమాగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ మాస్ జాతరను తలపిస్తుందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత మహేష్ నుండి స్టైలిష్ లుక్కుతో పాటు మాసివ్ యాక్షన్, ఆటిట్యూడ్ అదిరిపోయింది. అంతే అద్భుతమైన డైలాగ్స్ అదరగొట్టేశాడు మహేష్.
ఈ సినిమా బ్యాంకు లావాదేవీల చుట్టూ జరిగే నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక ట్రైలర్ లో మహేష్ లుక్కు – యాస భాష అన్ని ప్రేక్షకులను ఫిదా చేసేలా ఉన్నాయి. చాలాకాలం తర్వాత మహేష్ కొత్తగా కనిపిస్తున్నాడు. అలాగే బాడీ లాంగ్వేజ్ పరంగా చాలా ఓపెన్ అయినట్లు ఆటిట్యూడ్ చూస్తే అర్థమవుతుంది.
ఇక మహేష్ ఫుల్ ఆన్ యాక్టీవ్ నెస్ కి, కీర్తి సురేష్ క్యూట్ నెస్ తోడైతే ఎలా ఉంటుందో త్వరలోనే స్క్రీన్ పై చూడబోతున్నాము. మహేష్ పలికిన ఒక్కో డైలాగ్ మాస్ ఫీస్ట్ లా అనిపిస్తున్నాయి. ఇవే గనక థియేటర్లో వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. పోకిరి, బిజినెస్ మ్యాన్ ల తర్వాత ఈ సినిమాలోనే మహేష్ సెటిల్డ్ యాక్టింగ్ నుండి బయటికి వచ్చాడు. ఇక మహేష్ తో ఫస్ట్ టైం అయినా.. డైరెక్టర్ పరశురామ్ అదిరిపోయే మాసివ్ స్క్రిప్ట్ రెడీ చేశాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ అయితే సినీ ఫ్యాన్స్ అందరికీ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి.
ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించాడు. ట్రైలర్ లో డైలాగ్స్, సీన్స్ ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బిజీఎమ్ ఇచ్చాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. మరి సర్కారు వారి పాట ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.