ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతుంది. గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ.. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలు చేస్తోంది వరు. ఈ క్రమంలో వరలక్ష్మికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినీ ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగులో వరలక్ష్మికి మంచిక్రేజ్ ఉంది. క్రాక్ సినిమాలో జయమ్మగా, వీరసింహారెడ్డిలో భానుమతి క్యారెక్టర్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ.. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలు చేస్తోంది వరు. ఈ క్రమంలో వరలక్ష్మికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరలక్ష్మి నటించిన తమిళ చిత్రం ‘కొండ్రాల్ పావమ్’.. మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ మూవీ ఈవెంట్ లో భాగంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. కూతురు వరలక్ష్మి గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. “ఇప్పుడు అందరూ వరలక్ష్మిని నటి విజయశాంతి అంటున్నారు. అది నిజమే. నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే.. ఇప్పుడు అవసరమా? అని అన్నాను. అయినా తాను సినిమాలు చేసి.. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. దీనికి హార్డ్ వర్కే కారణం. అంతేగాక వరలక్ష్మి చాలా ధైర్యవంతురాలు. ఓ రోజు రాత్రి.. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని, ఇద్దరు కుర్రాళ్లను చితక్కొట్టిందని కాల్ వచ్చింది. నేను కంగారు పడ్డాను. కానీ.. ఆ కుర్రాళ్ళు అంతకుముందే వరలక్ష్మి కార్ కు డ్యాష్ ఇచ్చారని తెలిసింది. అందుకే వారిని కొట్టింది” అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వరలక్ష్మి గురించి శరత్ కుమార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి వరలక్ష్మి ధైర్యాన్ని కొనియాడుతూ.. నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మార్చి 5న వరలక్ష్మి తన 38వ పుట్టినరోజును జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మికి అడ్వాన్స్ బర్త్ డే విషెష్ తెలియజేస్తూనే.. ఫ్యాన్స్, నెటిజన్స్ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. మరి ప్రెజెంట్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి.. త్వరలోనే పర్సనల్ లైఫ్ కి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.