తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు ప్రముఖ నటుడు శరత్ బాబు. విలక్షణమైన నటుడిగా తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించారు. 250కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి అశేషమైన ప్రేక్షక అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 22న దివికేగారు.

నటుడు శరత్ బాబు వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులున్నాయి. వైవాహిక జీవితం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే అయిపోయింది. దీంతో శరత్ బాబుకు సంతానం లేకుండా పోయింది. దీంతో ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయనే చర్చలు మొదలయ్యాయి. సినిమాల ద్వారా నటుడు శరత్ బాబు భారీగానే స్థిర, చరాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. చెన్నైతో సహా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో విల్లాలు, స్థిరాస్తులు భారీగా కొనుగోలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా నటుడు శరత్ బాబుకు సంతానం లేకపోయినప్పటికి తోడబుట్టినవారు ఉన్నారు. ఆయనకు ఎనిమిది మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా శరత్ బాబే చేదోడువాదోడుగా ఉండేవారని అంటున్నారు. మరి తన ఆస్తులను వీరిలో ఎవరి పేరుమీదనైనా రాసారా అన్న అంశంపై శరత్ బాబు సోదరుడు మధు స్పంధించారు. ఆస్తుల పంపకాల గురించి మాట్లాడటం ఇది సరైన సమయం కాదని, ఆయన ఎవరిపేరు మీద రాస్తే వారికే చెందుతాయని తెలిపారు. మాది ఉమ్మడి కుటుంబమని ఆస్తుల కోసం కలహాలు పెట్టుకోమని వెల్లడించారు. దశదిన కర్మ తరువాత అన్నయ్యకు సంబంధించిన లాకర్లు చూస్తామని, ఆస్తులకు సంబంధించి వీలునామా రాసుంటే ఆ ప్రకారంగానే ముందుకెల్తామని స్పష్టం చేశారు.