ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏ సెలబ్రిటీ అయినా సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పటికప్పుడు వారి డైలీ రొటీన్స్ పోస్ట్ చేస్తుంటారు. సినిమా వాళ్ళైతే కొత్త సినిమాల అప్ డేట్స్ ఇస్తారు, మోడలింగ్ లో ఉన్నవారైతే కొత్త ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంటారు. మరి సెలబ్రిటీల పిల్లలు ఏం చేస్తారు? స్పోర్ట్స్ సెలబ్రిటీల పిల్లలు స్పోర్ట్స్ లోనే ఉండాలనే రూల్ లేదు. అలాగే సినిమావాళ్ళ పిల్లలు సినిమాల్లోనే ఉంటారనేది లేదు.
ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించని ఓ స్పోర్ట్స్ స్టార్ కూతురు.. త్వరలోనే హీరోయిన్ గా డెబ్యూ చేయబోతుందంటే.. ఖచ్చితంగా ఇంటరెస్టింగ్ విషయమనే చెప్పాలి. ఇంతకీ హీరోయిన్ అయ్యేంత అందంగా ఉన్న ఆ స్పోర్ట్స్ స్టార్ కూతురు ఎవరా అనుకుంటున్నారా! క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్. తండ్రి క్రికెట్ లో లెజెండ్ అయితే.. సారా సోషల్ మీడియాలో మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సెలబ్రిటీ.
మరి సచిన్ కూతురు కదా.. ఎలాగో తండ్రి చెప్పిన బాటలో నడుస్తుంది. లేదా ఇష్టమైన చదువు పూర్తిచేసి లైఫ్ లో సెటిల్ అయ్యే దిశగా ఆలోచిస్తుంది అనుకుంటారు. కానీ సారాకి ఫేవరేట్ విషయం మరోటి ఉంది. అదే మోడలింగ్. సారాకి మోడలింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకే పలు బ్యూటీ బ్రాండ్ యాడ్స్ లో కూడా మెరిసింది. ఈ క్రమంలో ఆమె కొద్దిపాటి యాక్టింగ్ కూడా నేర్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఎలాగో 1.9 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగి ఉంది, మోడలింగ్ యాడ్స్ లో కూడా కనిపించింది.. ఇంకేం సారా కూడా సినిమాల్లోకి రానుందని జనాలు ఫిక్స్ అయిపోయారు.
అందుకు తగ్గట్టుగానే సారా హీరోయిన్ కాబోతుందని.. త్వరలోనే బాలీవుడ్ లో స్టార్ హీరో సరసన హీరోయిన్ గా డెబ్యూ చేయనుందని వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో సారా యాక్టీవ్ నెస్ చూసి అంతా నిజమే అనుకున్నారు. మొన్నే బర్త్ డే సందర్భంగా సారా సినీ ఎంట్రీపై అప్ డేట్ వస్తుందని వెయిట్ చేశారు. కానీ తాజాగా సారా తండ్రి లెజెండ్ సచిన్ స్పందించినట్లు తెలుస్తుంది.
‘సారా సినీ డెబ్యూపై వస్తున్న వార్తలన్నీ పుకార్లే’ అని తేల్చేశారని సమాచారం. మరి 24 ఏళ్ల సారా.. లండన్ లో మెడిసిన్ చదివి ఇంటర్నేషనల్ బ్రాండ్ ‘సెల్ఫ్-పోట్రెయిట్’ కోసం మోడలింగ్ లో అడుగుపెట్టింది. కానీ సినిమాల కోసం కాదని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి సారా టెండూల్కర్ సినిమాల్లోకి వస్తే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.