కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ప్రముఖ చిత్రకారుడు, ర్యాపర్ అయిన శంతను హజారికాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. వాళ్లు కలిసే ఉంటున్నారు కూడా. అయితే వారి పెళ్లి ఆల్రెడీ జరిగిపోయిందంటూ శంతను పెద్ద షాకే ఇచ్చాడు. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అనే అనుమానం సినిమా ఇండస్ట్రీలో మొదలైపోయింది.
ఇదీ చదవండి: పల్లె పాటకు పట్టాభిషేకం.. ‘మధు ప్రియతో బతుకు బాట’..
శంతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు శ్రుతిహాసన్ కు ఆల్రెడీ పెళ్లైపోయింది. మేమిద్దరం క్రియేటివ్ పీపుల్. మా పెళ్లి క్రియేటివ్ గా జరిగిపోయింది. అందుకు మా ఇద్దరి మధ్య బంధమే నిదర్శనం. మేమిద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేయాలనుకుంటాం. శ్రుతి నా జీవితంలో ఎంతో స్ఫూర్తి నింపింది. నన్ను చూసి ఆమె కూడా ఎంతో ఇన్ స్పైర్ అవుతుంటుంది. పెళ్లి విషయానికి వస్తే క్రియేటివ్ గా మా పెళ్లి అయిపోయింది. ప్రత్యక్షంగా ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం నాకు కూడా తెలీదు’ అంటూ శంతను చెప్పుకొచ్చాడు. బయట పుకార్లలా శ్రుతిహాసన్ కు రియాలిటీలో పెళ్లి ఇంకా జరగలేదు. శంతను చెప్పిన పెళ్లి కేవలం క్రియేటివ్ పెళ్లి మాత్రమే. శంతను వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.