ఘాజీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్‌రెడ్డి.. ‘ఐబీ 71’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఈ సినిమా IMBD (ఇండియన్ మూవీ డేటా బేస్) ఈ సినిమాకు హైయెస్ట్ రేటింగ్ తెచ్చుకుంది.
సంకల్ప్ రెడ్డి.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన మొదటి సినిమా ‘ఘాజీ’తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయన. ఆ సినిమా తెలుగు, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడిగా సంకల్ప్ పని తీరుకు ప్రేక్షకులతో పాటు సినిమా వాళ్లు కూడా ఫిదా అయ్యారు. ఇక, ఆయన తాజా చిత్రం ‘ఐబీ 71’ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెలుగు కుర్రాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. సినిమాల మీద ఇంట్రస్ట్‌తో చదువును మధ్యలోనే ఆపేశారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫిల్మ్ స్కూలో చేరారు. డైరెక్షన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. ఘాజీ సినిమాతో దర్శకుడిగా మారారు. తన మొదటి సినిమాతో తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘ఐబీ 71’ సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. సినిమాకు సినిమాకు మధ్య వేరియేషన్స్ చూపుతూ.. కథలో కొత్తదనం.. సినిమా తెరకెక్కించే విధానంలో తన మార్కును చూపిస్తూ సంకల్ప్ దూసుకుపోతున్నారు. బాలీవుడ్ సినిమాకు తెలుగోడి సత్తా ఏంటో చూపిస్తున్నారు.
ఇక, ఆయన దర్శకత్వం వహించిన ‘ఐబీ 71’ అంతటి సంచలన విజయం సాధించటం వెనుక సంకల్ప్ మార్కు పనితనం ఉందని చెప్పటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాకు అన్ని మీడియా సంస్థలు మంచి రివ్యూలు ఇచ్చాయి. అంతేకాదు! IMBD (ఇండియన్ మూవీ డేటా బేస్) ఈ సినిమాకు హైయెస్ట్ రేటింగ్ ఇచ్చింది. 9.0 రేటింగ్‌తో ‘ఐబీ 71’ దేశంలోనే టాప్‌లో ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత రేటింగ్ వచ్చిన సినిమా ఇదే కావటం విశేషం. మరి, బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు సంకల్ప్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.