దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఫీవర్ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్‌లో అయితే కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ మాన్‌స్టర్ రాఖీ భాయ్, ప్రశాంత్ నీల్ కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో కేజీఎఫ్ 2 సినిమా 410 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో రాఖీకి అంత ఎలివేషన్స్ లభించడానకి కారణం సంజయ్ దత్ ఆ స్థాయిలో పోటీ ఇవ్వడమే. సంజయ్ దత్ కూడా ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా సంజయ్ పంచుకున్నాడు.
ఇదీ చదవండి: KGF ఛాప్టర్ 2 మూడు రోజుల కలెక్షన్స్!
తనకు మాదకద్రవ్యాలు ఎలా అలవాటు అయ్యాయి. ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు అనే విషయాలను పంచుకున్నాడు. ‘నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గుగా ఉండేది. ఎలా మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. ఎలాగైనా వారితో మాట్లాడాలని మత్తు పదార్థాలు అలవాటు చేసుకున్నాను. అవి వాడితే అమ్మాయిలకు కూల్ గా కనిపిస్తాననే భ్రమలో ఉండేవాడిని. తర్వాత క్రమంగా నేను మాదకద్రవ్యాలకు బానిసగా మారిపోయాను. నేను వాటి నుంచి బయటపడేందుకు ఎంతో కష్ట పడ్డాను. నా జీవితంలో ఆ పది సంవత్సరాలు అయితే ఇంట్లో లేదా బాత్ రూమ్ లో ఉండేవాడిని’.
‘అందరికీ దూరంగా ఓ ఒంటరి ప్రపంచంలో జీవించేవాడిని. వాటినుంచి బయటపడేందుకు ఎంతో కష్టపడ్డాను. రీహెబలటేషన్ సెంటర్ లోనూ కొన్నాళ్లు ఉన్నాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక అందరూ నన్ను డ్రగ్గీ అని పిలిచేవారు. అలాంటి మచ్చను తుడిచివేసేందుకు ఎంతో కృషి చేశాను. ఆ తర్వాత బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాను. నా ఛేంజోవర్, ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అంతా క్యా బాడీ హే అంటూ మెచ్చుకున్నారు. ఆ సమయంలో చాలా సంతోషంగా అనిపిచింది’ అంటూ సంజయ్ దత్ తన జీవితంలోని చీకటి రోజుల గురించి ప్రస్తావించాడు. సంజయ్ దత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.