సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నప్పుడే దూకుడు ప్రదర్శించాలి. హీరో, దర్శకుడు, హీరోయిన్ ఇలా ఎవరైనా కావొచ్చు.. అత్యుత్తమ దశలో ఉన్నపుడే వారి డ్రీమ్స్ తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము. ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.
సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా ఓకే చేయడానికి బడా డైరెక్టర్లు సైతం కొన్నిసార్లు ఎదురు చూడక తప్పదు. ఒకవేళ టాప్ హీరోతో సినిమా ఓకే అయితే..ఆ డైరెక్టర్ అదృష్టవంతుడే అని చెప్పాలి. ఎందుకంటే టాప్ హీరోలు తక్కువగా ఉండడం.. దర్శకులు ఎక్కువైపోవడమే దీనికి కారణం. కొన్ని సందర్భాల్లో ఒక దర్శకుడు స్టార్ హీరోతో హిట్టు కొట్టినా.. ఆ తర్వాత సినిమాకి మరో స్టార్ హీరో దొరకడం చాలా కష్టమైపోతుంది. కానీ సందీప్ వంగా మాత్రం వరుస పెట్టి టాప్ హీరోలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లతో సినిమాలను ఓకే చేసిన ఈ డాషింగ్ డైరెక్టర్.. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా తన కథను వినిపించడానికి సిద్ధమైపోయాడని తెలుస్తుంది.
సందీప్ వంగా తీసిన ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. 2017లో తొలిసారి డైరెక్టర్ గా విజయ్ దేవరకొండతో “అర్జున్ రెడ్డి” సినిమా చేసి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ వంగా.. అదే సినిమాని “కబీర్ సింగ్” పేరుతో హిందీలో రీమేక్ చేసి నార్త్ లో కూడా హిట్టు కొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఈ డైరెక్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తనకు సినిమా చేయాలని ఉందని తెలియజేశాడు సందీప్ వంగా. “నేను చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తాను. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆయన నా సినిమాను అంగీకరిస్తాడనే అనుకుంటుంటున్నాను”. అని చెప్పుకొచ్చాడు.
అయితే.. ఈ అర్జున్ రెడ్డి డైరెక్టర్ మెగాస్టార్ తో చిరంజీవిని ఒప్పించడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా..ఇలా వరుస పెట్టి స్టార్ హీరోలని తన కథలతో మెప్పిస్తుండడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ తో పాన్ ఇండియా లెవల్లో “యానిమల్” సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ తో కూడా ఇటీవలే ఒక సినిమా చేస్తున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు కోలీవుడ్ స్టార్ విజయ్ తో కథ ఓకే చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాననే వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి ఇంత మంది స్టార్ హీరోలకు ఈ డైనమిక్ డైరెక్టర్ ఏ మంత్రం వేస్తున్నాడనే సందేహం ఇప్పుడు సగటు సినీ అభిమానిలో ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపండి.