తెలుగులో మంచి విజయాలతో దూసుకుపోతున్నారు సంయక్త. ఆమె తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాకు చెప్పారు. తమతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారని చెప్పారు.
వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా పేరు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్త మీనన్. ఆమె నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో హీరోయిన్ సంయుక్త క్రేజ్ వేరే లెవల్‌కు వెళ్లిపోయింది. జనం ఆమెకు హిట్టు సినిమాల హీరోయిన్‌గా నామకరణం కూడా చేసేశారు. ప్రస్తుతం ఆమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా వైరల్‌గా మారింది. సంయుక్త తనను, తన తల్లిని ఇబ్బంది పెట్టిన ఓ వ్యక్తి చెంప పగులగొట్టారంట. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని ఆమె తాజాగా, ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సంయుక్త మాట్లాడుతూ.. ‘ నేను మా అమ్మ కలిసి ఓ సారి బయటకెళ్లాం. ఓ చోట మేము నిలబడి ఉన్నాం. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అతడు పొగను మాపై వదులుతూ ఉన్నాడు. మేము అక్కడినుంచి పక్కకు వెళదామని అనుకున్నాం. కానీ, పక్కకు వెళ్లటానికి స్థలం లేకపోవటంతో ఆగిపోవాల్సి వచ్చింది. మా అమ్మకు శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతో అతడ్ని పక్కకు వెళ్లి తాగమని రిక్వెస్ట్ చేశాను. అతడు వినలేదు. పైగా మాతో అసభ్యంగా మాట్లాడాడు.
నాకు కోపం కట్టలు తెంచుకుంది. అతడి చెంప చెళ్లుమనిపించాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, సంయుక్త మీనన్ 2016లో వచ్చిన ‘పాప్‌కార్న్’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లానాయక్’తో తెలుగు తెరపైకి అడుగుపెట్టారు. తెలుగులో బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలు చేశారు. ఈ సినిమాలు మొత్తం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక, సంయుక్త తెలుగులో ప్రస్తుతం ‘డెవిల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి, సంయుక్త డేరింగ్ యాటిట్యూడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.