సంయక్త మీనన్" ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో తెలుగులో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సంయుక్త తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
ఆడవారికి బయట ఎదురయ్యే సమస్యల గురించి తెలిసిందే. చెడుగా కామెంట్ చేయడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం లాంటి విషయాలు ఈనాటికీ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అందంగా ఉండే అమ్మాయిల విషయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యను కొందరు బయపడి వదిలేస్తే.. మరికొందరు మాత్రం ధైర్యంగా ఎదురు తిరిగి వారి అంతు చూస్తారు. వీరిలో రెండో రకానికి చెందింది హీరోయిన్ సంయుక్త మీనన్. తాజాగా తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది.
“సంయక్త మీనన్” ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో తెలుగులో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉంది. బీమ్లా నాయక్ సినిమాతో మొదలుకొని ఇటీవలే విడుదలైన విరూపాక్ష సినిమా వరకు ఈ భామ పట్టిందల్లా బంగారమే అనేట్లుగా ఉంది. ఇక విరూపాక్ష సినిమాలో గ్లామర్ తో పాటు నటనలో కూడా అందరి ప్రశంసలు అందుకుంటుంది సంయుక్త. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సంయుక్త తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
“ఒకసారి అమ్మతో కలిసి నేను బయటకు వెళ్తున్నాను. అక్కడ ఒక ఆకతాయి సిగరెట్ తాగుతూ మా మీదకి వదిలాడు. నేను చూస్తూ ఉండలేకపోయాను. ఎందుకంటే అలా చూస్తూ ఉంటే వాడు మరి బరి తెగిస్తాడు. అందుకే వాడి చెంప చెళ్లుమనిపించా. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని గట్టిగా బుద్ధి చెప్పాను. అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో అస్సలు భయపడకూడదు. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సంఘటనలు ఎదరైనప్పుడు మనకెందుకులే అని వెళ్లిపోతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నేను అలా అమయాకంగా ఉండలేను” అని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో సంయక్త మీనన్ అమ్మ దగ్గరే పెరిగింది. మరి సంయక్త చేసిన ఈ పని మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.