'సార్', 'విరూపాక్ష'తో హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయిన సంయుక్త.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనని ఆ విషయంలో చాలా విమర్శించేవాళ్లని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏంటి విషయం?
సంయుక్త మేనన్.. ఈ పేరు టాలీవుడ్ లో బాగా ఫేమస్. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేస్తే అవన్నీ హిట్ లేదా సూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ‘డెవిల్’ అనే మూవీలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ మలయాళ ముద్దుగుమ్మ.. తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి చిన్నగా ఉన్నాయని తనని అప్పట్లో విమర్శించే వాళ్లని సంయుక్త చెప్పడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. ‘భీమ్లా నాయక్’లో సంయుక్తది అంత పెద్ద రోల్ ఏం కాదు. అయినాసరే తన మార్క్ చూపించింది. ఆ తర్వాత ‘బింబిసార’ మూవీలో మోడ్రన్ పోలీస్ గా కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల్ని పలకరించిన ‘సార్’ అయితే సంయుక్తకి నెక్స్ట్ లెవల్ క్రేజ్ తీసుకొచ్చింది. కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చిన ‘విరూపాక్ష’లోనూ సంయుక్త అదిరిపోయే యాక్టింగ్ తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసింది. ఇలా చేసిన నాలుగు మూవీస్ హిట్ కావడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి లక్కీ ఛార్మ్ అయిపోయింది. దీంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంయుక్త.. ”విరూపాక్ష’ కోసం చేస్తామని అన్నారు. అప్పటికే 20 సినిమాలు చేశాను. అయినాసరే ఆడిషన్స్ కి ఓకే అన్నాను. ప్రేమ, కోపం, జాలి.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాను. టెస్ట్ లో పాసయ్యాను. అయితే కెరీర్ స్టార్టింగ్ లో నా కళ్లని చాలామంది విమర్శించేవాళ్లు. అవి చాలా చిన్నగా ఉన్నాయని అన్నారు. ఇప్పుడవే ఎక్స్ ప్రెషన్స్ ని బాగా పలికిస్తున్నాయని మెచ్చుకుంటున్నారు’ అని సంయుక్త చెప్పుకొచ్చింది. సో అదన్నమాట విషయం. మరి సంయుక్త చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.