యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇక తారక్ పోలిటికల్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులతో పాటు.. తెలుగుదేశం నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎంట్రీతోనే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని భావించేవారు కోకొల్లు. అయితే ఎన్టీఆర్ మాత్రం.. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదనే ఉందని.. ఇప్పటికైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
అయితే ఎన్టీఆర్ ఎప్పుడో అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించడం ఖాయమని.. ఎప్పుడో ఒకప్పుడు ఆయన రాష్ట్రాన్ని శాసించడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు. మరి ఇంతకు ఎన్టీఆర్‌కు ప్రస్తుత రాజకీయాలపై అవగాహన ఉందా.. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్‌లో రాజకీయాలను అనుసరిస్తారా అనే ప్రశ్నలకు నటుడు సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలపై ఎన్టీఆర్‌కు అపారమైన అవగాహన ఉంది. తమిళనాడు రాజకీయాల గురించి కూడా మాట్లాడతారు. తమిళనాడు ఎన్నికలకు ముందు కూడా డీఎంకే గెలుస్తోందన్నారు. ఫలితాల తర్వాత నేను మీకు ముందే చెప్పాను అని నాకు గుర్తు చేశాడు’’ అని వెల్లడించారు. మనం ఎన్టీఆర్‌తో కూర్చుంటే వైబ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సమాజం, రాజకీయాల గురించి మాట్లాడవలసి వస్తే ఎన్టీఆర్‌తో మాట్లాడాలి అని సముద్రఖని తెలిపారు.
ఇది కూడా చదవండి: Kota Srinivas Rao: Jr.NTR పై కోట శ్రీనివాస్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు!
త్రిబుల్ ఆర్ సినిమాలో సముద్రఖని నటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక నటుడుగా ఎన్టీఆర్‌ను మరో మెట్టు ఎక్కించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి రాజకీయాలపై ఎన్టీఆర్‌పై సముద్రఖని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jr NTR : ఇంటర్మీడియట్ పరీక్షలో జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్!