శనివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా పవన్ సినిమా పరిశ్రమను ఉద్దేశిస్తూ ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దీంతో ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
మాకు పవన్ కళ్యాణ్ అయినా.. సంపూర్ణేష్ బాబైన ఒకటేనని, అందరూ ఒకే విధంగా కష్టపడతారని అన్నారు. ఇక టికెట్ రేట్ విషయంలో అందుకే అందరిని ఒకేలా చూస్తామని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. మంత్రి అనిల్ వ్యాఖ్యలకు వెంటనే స్పందించారు నటుడు సంపూర్ణేష్ బాబు. మంత్రి అనిల్ గారు.., మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం సంతోషకరం. ఎలాంటి సమస్య వచ్చినా మంచి గొప్ప మనసుతో స్పందించే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు’ అని సంపర్ణేష్ బాబు ట్విట్టర్ వేదికగా మంత్రి అనిల్ కుమార్ ను కోరారు.
మంత్రి అనిల్ గారు,
మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం.
ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు. https://t.co/q129GEb9xg— Sampoornesh Babu (@sampoornesh) September 26, 2021