హృదయం కాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సెటైరికల్ మూవీస్ తో తెలుగు చలనచిత్ర రంగంలో సంపూ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇదే ఊపులో బర్నింగ్ స్టార్ ‘క్యాలీఫ్లవర్’ మూవీలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘శీలో రక్షతి రక్షిత: అనేది క్యాప్షన్.
ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ మంచి రీచ్ ని సొంతం చేసుకోగా.., తాజాగా టైటిల్ థీమ్ పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ థీమ్ పోస్టర్ లో సంపూ ఏకంగా అసెంబ్లీ ముందే నగ్నంగా ధర్నాకు దిగినట్లు కనిపిస్తోంది. ఒంటి మీద బర్నింగ్ స్టార్ ఎలాంటి దుస్తులు లేకుండా కేవలం క్యాలీఫ్లవర్ ని అడ్డుపెట్టుకుని నగ్నంగా నిలబడిన ఈ పోస్టర్ అందరిని షాక్ కి గురి చేస్తోంది.
శీలో రక్షతి రక్షితః అనే ట్యాగ్ లైన్ ని బట్టి చూస్తే సంపూ తన శీలాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ధర్నాకు దిగాడా అన్న చర్చ నడుస్తోంది. ఇక క్యాలీఫ్లవర్ చిత్రంలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఇంగ్లీష్ మ్యాన్ గా సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘క్యాలీఫ్లవర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి విడుదల అయ్యాక.., క్యాలీఫ్లవర్ సంపూకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.