హృదయకాలేయం- కొబ్బరిమట్ట లాంటి ఎరోటిక్ కామెడీ చిత్రాలతో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన సంపూర్ణేష్ బాబు వరుసగా ఒకదానివెంట ఒకటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల క్రైసిస్ లో కొన్ని రిలీజ్ లు ఆలస్యమవుతున్నాయి కానీ ఈపాటికే అతడి నుంచి ఒకట్రెండు సినిమాలు రిలీజ్ కి రావాల్సి ఉంది.బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ ఐదో సినిమా క్యాలీఫ్లవర్
లుక్ లాంచ్ అయ్యింది. తొలి చిత్రం ‘హృదయకాలేయం’తో బర్నింగ్ స్టార్ గా గుర్తింపు పొందాడు సంపూర్ణేష్ బాబు. మే 9 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త సినిమాను ప్రకటించింది మధుసూదన క్రియేషన్స్ సంస్థ. ‘క్యాలీఫ్లవర్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ బ్యాంగ్ ను వీడియో గా విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ ఇంగ్లీష్ మేన్ గా దర్శనం ఇవ్వటం విశేషం. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్.కె మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. క్లాలీఫ్లవర్ కే తాతలా దిగాడు అతడు. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఈ విజువల్ మైండ్ బ్లాక్ చేస్తోంది. భారతదేశ మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఇంగ్లండ్ నుంచి దిగాడు ఈ క్యాలీఫ్లవర్!! ఇది పూర్తి కామెడీ ఎంటర్ టైనర్. ఆర్.కె.మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సంపూ సరసన వసంత కథానాయికగా నటిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి- పృథ్వీ- నాగ మహేష్- గెటప్ శ్రీను- రోహిణి-కాదంబరి కిరణ్- కల్లు కృష్ణారావు తదితరులు తారాగణం. ప్రజ్వాల్ క్రిష్ సంగీతం అందిస్తుండగా.. ముజీర్ మాలిక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూట్ ఇటీవల ప్రారంభమైంది.