‘మైనే ప్యార్ కియా’ సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భాగ్యశ్రీ. ఆమె తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో సినిమాలు చేశారు.
‘మైనే ప్యార్ కియా’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు భాగ్యశ్రీ. 1989లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ అయి విడుదలైంది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మైనే ప్యార్ కియా సినిమా సాధించిన విజయంతో భాగ్యశ్రీకి మంచి గుర్తింపు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, బెంగాలి, మరాఠీ భాషల్లో ఆమెకు వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ అయిపోయారు. హీరోయిన్‌గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె హిమాలయ దాసాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు పుట్టారు.
పెళ్లి తర్వాత కూడా భర్త అంగీకారంతో ఆమె సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె 2001లో ‘ఆంకియోంకే జారకోన్‌సే’ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ శోభనం సీన్‌లో నటించటానికి భాగ్యశ్రీ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని ఆ సినిమాలో హీరోగా చేసిన సమిర్ సోనీ మీడియాకు వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఆ సినిమాలో మేమిద్దరం ప్రేమికుల పాత్ర పోషిస్తూ ఉన్నాం. తనది అంధురాలి పాత్ర. ఓ రోజు శోభనం సీను షూటింగ్ జరుగుతోంది. మా డైరెక్టర్ ఈ సీన్ కోసం మంచి ఫ్రేమ్ సెట్ చేసి పెట్టాడు. ఆ సీనులో భాగంగా నేను ఆమె దగ్గరకు వెళ్లాను. తను మాత్రం పక్కకు జరుగుతూ ఉంది. ఇలా చాలా సార్లు జరిగింది. చాలా టేకులు అయ్యాయి.
నాకు అర్థం కాలేదు. తను అంధురాలు కాబట్టి.. నేను పక్కకు వెళ్లినపుడు ఆమె కదలకూడదు. కొద్ది సేపటి తర్వాత భాగ్యశ్రీ నా దగ్గరకు వచ్చింది. ‘‘ సమీర్ నువ్వు దీన్ని పర్సనల్‌గా తీసుకోవద్దు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్లు నన్ను ఇలాంటి సీన్లలో చూస్తే.. ఇబ్బందిగా ఫీలవుతారు’’ అని అంది. నేను ఆమె చెప్పిన మాటలతో అంగీకరించాను. ఆ విషయాన్ని నేరుగా డైరెక్టర్‌కు చెప్పమన్నాను’’ అని అన్నాడు. మరి, శోభనం సీనులో నటించడానికి ఇబ్బందిపడ్డ భాగ్యశ్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.