గత ఏడాది యశోదతో మెప్పించారు టాలీవుడ్ స్టార్ నటి సమంత. మయోసైటిస్ వ్యాధి బారిన పడి, పూర్తిగా కోలుకున్నాక సామ్ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. విజయ్ దేవర కొండ ఖుషీ షూటింగ్ లో పాల్గొనడంతో పాటు, హిందీ వెబ్ సిరిస్ సిటాడెల్‌లో వరుణ్ ధావన్ పక్కన సందడి చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శాకుంతలం సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉండగా.. అది కాస్తా వాయిదా పడింది. ఎప్పుడూ ఈ సినిమా విడుదలవుతుందో మేకర్స్ వెల్లడించలేదు. దీంతో మిగతా షూటింగ్‌లపై ఆమె దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ నిమిత్తం ఆమె ముంబయిలో ఉన్నట్లు వినికిడి.
సిటాడెల్ షూటింగ్ నిమిత్తం సామ్ ఎక్కువ రోజులు ముంబయిలో ఉండాల్సి వస్తుండటంతో అక్కడ ఇళ్లును కొనుగోలు చేయాలని ఆమె భావిస్తున్నారట . ఈ నేపథ్యంలో రూ. 15 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను చూశారని, దాన్నే కొనుగోలు చేయాలని యోచిస్తున్నరని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆమె స్పందించాల్సి ఉంది. అయితే గతంలోనూ ఆమెపై ఇటువంటి వార్తలే వచ్చాయి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత, ఆమె ముంబయికి మకాం మార్చాలని అనుకుంటుందని వార్తలు రాగా, హైదరాబాద్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. తనకు ఇక్కడి నుండి వెళ్లనని చెప్పకనే చెప్పారు.
టాలీవుడ్ క్యూట్ జంటగా పేరొందిన సామ్, నాగ చైతన్యలు విడిపోతున్నామంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. అయితే ఎందుకు విడిపోయారే ఇప్పటికీ కారణాలు చెప్పలేదు. ఆ తర్వాత ఎవరీ లైఫ్ ను వాళ్లు లీడ్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసే ఉండే ఇంటిని కూడా సామ్ కొనుగోలు చేసినట్లు నటుడు మురళీ మోహన్ చెప్పారు. కాగా, పుష్పలో ఓ ప్రత్యేక పాటలో ఆడి పాడిన సామ్, అనంతరం యశోదతో ముందుకు వచ్చారు. అయితే అప్పటికే మయోసైటిక్ రావడంతో ఈ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనలేదు. తాజాగా శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో కూడా చేయలేదు. అయితే ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. సమంత ముంబయికి మకాం మారుస్తారని భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.