ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన యశోధ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రానే వచ్చేసింది. ఈ గ్లింప్స్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయనే చెప్పాలి. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తన నటనపై అంచనాలు పెంచేస్తోంది. గ్లింప్స్ విషయానికి వస్తే.. యశోధ ఒక్కసారిగా నిద్రలేచి చూస్తుంది. ఆమె ఎక్కడో దూరంగా జైలులాంటి పెద్ద కట్టడంలో ఉంటుంది. ఆమె ఎక్కడ ఉన్నదీ ఆమెకు కూడా తెలియదు. ఈ సినిమా శ్రీదేవీ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హరి శంకర్- హరి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న యశోధ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యశోధ గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Here’s the engrossing glimpse of @Samanthaprabhu2‘s #Yashoda 🕊💥
Telugu: https://t.co/lp8k4hPAnp
Hindi: https://t.co/iwp9W7trMH
Kannada:https://t.co/ho25Le4qEu
Tamil:https://t.co/Tw2iEW5j5Y
Malayalam:https://t.co/cRNMS1JJtn pic.twitter.com/6Mjv34wX16— Aditya Music (@adityamusic) May 5, 2022