సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకోసం చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని సినిమా షూటింగ్‌లకు సైతం బ్రేక్ ఇచ్చారు.
ప్రముఖ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే యాంటీ ఇమ్యూన్ డిసీజ్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె కొద్ది నెలల క్రితమే బయట పెట్టారు. చికిత్స తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మైయోసైటిస్ కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగా సినిమా షూటింగ్‌లలో సైతం పాల్గొనలేకపోతున్నారు. ఒకరకంగా కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించే యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ వ్యాధినుంచి బయటపడాలని కోరకుంటూ గుళ్లకు, గోపురాలకు సైతం తిరుగుతున్నారు.
ప్రత్యేకమైన పూజలు సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా, సమంత తమిళనాడులోని పళని గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి మెట్లపై కర్పూరంతో దీపాలు వెలిగించారు. దేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. తాను అనారోగ్యంనుంచి త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సమంత పంజాబీ డ్రెస్‌లో ఉన్నారు. ముఖానికి మాస్క్, కంటి అద్దాలు పెట్టుకున్నారు. ఎంతో ఓపెగ్గా ఒక్కో మెట్టుపై కర్పూరం పెట్టి, వాటిని వెలిగించుకుంటూ వెళ్లారు.
పూజ అనంతరం పలువురు అభిమానులతో ఫొటోలు దిగారు. కాగా, సమంత నటించిన ‘శాకుంతం’ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. ఈ సినిమాలో దేవ్ మోహన్, మోహన్ బాబు తదితరులు నటించారు. ఇక, సమంత నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో విజయ్ దేవర కొండకు జోడీగా ఆమె నటిస్తున్నారు. అనారోగ్యం కారణంగా సమంత ఖుషీ షూటింగ్‌కు వెళ్లలేకపోయారు. తాజాగా, ఆమె మళ్లీ సినిమా షూటింగ్‌కు వెళ్లటానికి నిశ్చయించుకున్నారు. షూటింగ్‌కు హాజరుకాలేపోయినందుకు విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్‌కు ఆమె క్షమాపణ చెప్పారు. మరి, సమంత పళని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.