సమంత షేర్ చేసిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది.
సమంత, నాగ చైతన్య కలిసి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘మజిలీ’ సినిమా ఒకటి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019, ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సమంత, నాగ చైతన్యల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా విడుదలై ఈ ఏప్రిల్ 5తో నాలుగేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సినిమా టీంకు సంబంధించిన ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
శివ నిర్వాణ పోస్టును సమంత తన ట్విటర్ ఖాతాలో రీ ట్వీట్ చేశారు. ఫోర్ ఇయర్స్ ఆఫ్ మజిలీ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దానికి ఓ లవ్ సింబల్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సమంత నటించిన ‘ శాకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పౌరాణిక సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చిత్రానికి దర్వకత్వం వహించారు. 80 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కింది.
మంచు మోహన్ బాబు, దేవ్ మోహన్, అదితి బాలన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. సమంత ప్రస్తుతం ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండుకు జంటగా చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా సమంత ఖుషీ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. దాదాపు నెలకుపైగా ఇంటికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం కొంత కుదట పడ్డాక మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మరి, సమంత, నాగ చైతన్య కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#4YearsofMajili ♥️ https://t.co/uWcftyByex
— Samantha (@Samanthaprabhu2) April 5, 2023