సమంత చాలా మంచిది.. ఆమె హ్యాపీగా ఉండాలి అంటూ నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సమంత ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
సమంత-నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్, బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు 2017, అక్టోబర్ 7న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి అన్యోన్యత చూసిన వారు.. దంపతులు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు.. 2021లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి.. అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటికి కూడా వీరిద్దరూ కలిస్తే బాగుండు అని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఎవరి దారిలో వారు పయనిస్తూ.. కెరీర్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు విడిపోయి.. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యాయి. విడాకుల గురించి సమంత పలు సందర్భాల్లో పరోక్షంగా నైనా కామెంట్స్ చేసింది కానీ.. నాగ చైతన్య మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయితే తాజాగా కస్టడీ మూవీ ప్రమోషన్ సందర్భంగా నాగ చైతన్య తొలిసారి సమంత గురించి మాట్లాడాడు. అది కూడా ఎంతో పాజిటీవ్‌గా.
‘‘సమంతతో గడిపిన రోజులను చాలా గౌరవిస్తాను. ఆమె చాలా లవ్లీ పర్సన్.. తను ఎప్పటికి అలాగే సంతోషంగా ఉండాలి.. ఆనందాలు ఆమెకు సొంతం కావాలి. సోషల్ మీడియా వల్ల వచ్చిన కొన్ని వదంతుల వల్లే మా మధ్య బంధం.. ఇబ్బందికరంగా మారింది. మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు.. జనాల్లోకి వెళ్లింది. ఈ విషయం నన్ను ఎంతో బాధ పెట్టింది. పైగా నాతో ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తిని దీనిలోకి లాగారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. సమంత గురించి చైతన్య ఇంత పాజిటివ్‌గా మాట్లాడటం చూసి అభిమానులు సంతోషించారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి.
చైతన్య కామెంట్స్ వైరలవుతోన్న వేళ.. సమంత చేసిన తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. ఇది చూస్తే.. నాగ చైతన్య వ్యాఖ్యలకు కౌంటర్‌గా చేసినట్లే ఉంది అంటున్నారు నెటిజనులు. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘‘మనమంతా ఒక్కటే.. కేవలం ఈగోలు, భయాలు, నమ్మకాలు మనల్ని దూరం చేశాయి’’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. సమంత చేసిన పోస్ట్ చూసిన నెటిజనులు.. చైతన్య వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఈ పోస్ట్ చేసింది అని అంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోవడం మాత్రం అభిమానులను ఇంకా బాధిస్తూనే ఉంది. మరి సమంత చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.