అక్కినేని వారసుడు అఖిల్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు స్టార్ హీరోయిన్ సమంత బర్త్ డే విషెస్ చెప్పారు. అఖిల్‌కు విషెస్ చెబుతూ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అక్కినేని వారసుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. రొమాంటిక్ చిత్రాలతో పాటు స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అఖిల్. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో భారీ సక్సెస్ అందుకున్నారు. ఇందులో పూజా హెగ్డే-అఖిల్‌కు మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయవంతమైన వెంటనే మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ మూవీకి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలుమార్లు వాయిదా పడిన ఈ ఫిల్మ్.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
‘ఏజెంట్’ రిలీజ్ బిజీలో ఉన్న అఖిల్ ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా అఖిల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన తాజా సినిమా ‘ఏజెంట్’ సక్సెస్ అవ్వాలంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. ‘హ్యాపీ బర్త్ డే అఖిల్.. ఏజెంట్ 28న రాబోతోంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. ప్రేమతో’ అంటూ హార్ట్ ఎమోజీని ఆ పోస్టుకు సామ్ జతచేశారు. ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. గతేడాది కూడా అఖిల్ పుట్టిన రోజున సామ్ విషెస్ చెప్పినా.. ఆయన స్పందించలేదు. ఈసారైనా సమంత పోస్టుకు రిప్లయ్ ఇస్తారేమో చూడాలి.