వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్లో తిరిగి బిజీ అవుతున్నారు సమంత. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తీరిక దొరికినప్పుడల్లా ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత కెరీర్లో స్పీడు పెంచారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండటంతో కొన్నాళ్లు మూవీస్ చేయడం తగ్గించారామె. అయితే దాని నుంచి వేగంగా కోలుకుంటున్న ఆమె.. కెరీర్‌పై తిరిగి ఫోకస్ పెంచారు. ఇటీవలే ‘శాకుంతలం’తో ఆడియెన్స్ ముందుకొచ్చారామె. అయితే ఈ ఫిల్మ్ ఆమెకు నిరాశనే మిగిల్చింది. సామ్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది ‘శాకుంతలం’. అయినా ఆమె మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. బాలీవుడ్లో ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సామ్. హాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ఆమె నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులతో అదరగొట్టనున్నారట సమంత. కెరీర్లో తొలిసారి పూర్తిగా యాక్షన్ కథాంశంతో సాగే కథలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో సమంతకు స్వల్ప గాయాలైనట్లు వార్తలు కూడా వచ్చాయి.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో టైమ్ దొరికినప్పుడు గడుపుతుంటారు సమంత. సింగిల్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తాజాగా పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. సరైన జోడీ కోసం వెతుకుతున్నానంటూ సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఆమె పార్ట్నర్ను వెతుకుతోంది తన కోసం కాదట. తన ఫ్రెండ్ డాక్టర్ జెవెల్ గమాడియాకు మంచి జోడీ కోసం వెతుకున్నారు సామ్. అతడి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సమంత.. అతడి లక్షణాలు చూచాయగా చెప్పారు. చాలా తెలివైనవాడని, గమాడియాకు జోడీ కావాలని సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇకపోతే, వెస్ట్రన్ ఆక్యుపెంచర్ ఎక్స్పర్ట్ అయిన గమాడియా దగ్గర కత్రినా కైఫ్‌తో పాటు పలువురు స్టార్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం గమనార్హం. సామ్ కూడా ఆయన వద్ద చికిత్స తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్.