సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మంది కలలు కంటారు. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఇండస్ట్రీలో రాణించాలనుకునే యువతుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరైన అవకాశం వచ్చే వరకు తమ అందాన్ని కాపాడుకుంటూ.. బతకడానికి ఏదో ఓక పని చేసుకుంటూ.. తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక తమ కంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేవరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారాలుగా వెలుగుతున్న ఎందరో ఒకప్పుడు యాడ్స్‌లో, మోడల్స్‌గా నటించిన వారే అధికం. ఇక కొందరు బుల్లి తెర మీద కూడా రాణించి ఆ తర్వాత బిగ్ స్క్రీన్ మీద వెలిగిపోతున్నారు. అయితే గుర్తింపు వచ్చే వరకు వారు నిరంతరం శ్రమిస్తారు. ఎక్కడా కుంగిపోరు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు తప్ప.. చిన్నతనంగా ఫీలవ్వరు. అదిగో అలాంటి వారే నేడు అగ్రతారాలుగా వెలుగొందుతారు. ఈ కోవలోకే వస్తారు నటి సమంత.
సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగి.. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. స్పెషల్ సాంగ్స్‌కి కూడా.. కోట్లు తీసుకుంటుంది. ఇక అటు సోషల్ మీడియా ద్వారా కూడా ఒక్కో పోస్ట్‌కు లక్షల్లో ఆర్జిస్తుంది. అయితే నటి సమంత మొదటగా తెలుగులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయింది. కానీ ఆ తరువాత ఈ అమ్మడికి పలు చిత్రాల్లో నటించే అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా అలరించక పోవడంతో కొంతకాలం పాటు అవకాశాల కోసం బాగానే శ్రమించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ స్టార్ హీరోయిన్ల సరసన రాణిస్తోంది.
ఇది కూడా చదవండి: Smriti Mandhana: పెట్రోల్ లేకున్నా.. స్మృతిని చూడటానికే వచ్చా! స్మృతి మందనపై అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్!
సమంత రూత్ ప్రభు కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తమై వచ్చి తమిళనాడు లో సెటిల్ అయ్యారు. దాంతో సమంత చదువులన్ని తమిళనాడు రాష్ట్రంలోని పూర్తి అయ్యాయి. కాగా నటి సమంత కి డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో అప్పుడప్పుడు పలు కాలేజీ కల్చరల్ ఈవెంట్లలో పాల్గొనేది. ఈ క్రమంలోనే. అయితే డిగ్రీ చదువుతున్న సమయంలో నటి సమంత తమిళనాడు కి చెందిన ఆషిక టెక్స్ టైల్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. పాకెట్ మనీ కోసం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో సమంత ఆ యాడ్‌లో నటించింది. ఇందుకుగాను అప్పట్లో సమంత కి దాదాపుగా ఐదు వేల రూపాయలు పారితోషకం ఇచ్చారట. కాగా ప్రస్తుతం ఆషిక టెక్స్ టైల్స్ కి సంబందించిన ఈ యాడ్ యూట్యూబ్లో తెగ హల్చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Priyanka Jawalkar: బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లిన ప్రియాంక జవాల్కర్.. ఆ క్రికెటరే అంటున్న నెటిజనులు!
ఇక దీనితో పాటు మరో యాడ్‌లో కూడా నటించింది సమంత. అది పసుపుకు సంబంధించింది. ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరలవుతోంది. ఇది చూసిన జనాలు.. ‘‘ఇంత హార్డ్‌వర్క్ చేసింది. శ్రమను నమ్ముకుంది కనుకే ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగింది. నేడు ఆమె అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ అల్లాటప్పాగా వచ్చింది కాదు.. చిన్నతనంగా ఫీలవ్వలేదు.. హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Upcoming Telugu Movies: జూలైలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న 11 సినిమాలు ఇవే!